Srimathi Srivaru OTT Release Today: తెలుగు ఓటీటీ రంగంలో వైవిధ్యమైన, కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను అందిస్తూ తనదైన ముద్ర వేస్తోంది తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. నేటితరం కథలతో పాటు మధ్య వయస్కులు, వృద్ధుల జీవితాల్లోని సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా సరికొత్త ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
హీరో సుమన్, నటి ప్రగతి జంటగా

ఆ సినిమానే 'శ్రీమతి శ్రీవారు'. తెలుగు సీనియర్ హీరో, నటుడు సుమన్, పాపులర్ నటి ప్రగతి భార్యాభర్తలుగా ప్రధాన పాత్రలు పోషించారు. ఒక ఆదర్శ దంపతుల జీవితంలో చోటుచేసుకున్న ఊహించని సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుంది.
పిల్లలు పెరిగి పెద్దయి, వారికి పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతలన్నింటినీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక వృద్ధ దంపతులు తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తారు. దశాబ్దాల ప్రయాణంలో ఒకరినొకరు ప్రాణంగా చూసుకునే ఆ దంపతులు, ఒకరు లేకుండా మరొకరు జీవించలేనంతగా మారిపోతారు.
బాధ్యతలు తీరిన వేళ.. ఊహించని మలుపు!
అలాంటి తరుణంలో, ఆ భార్య ప్రవర్తనలో అకస్మాత్తుగా ఒక పెద్ద మార్పు వస్తుంది. అసలు ఆ మార్పుకు కారణం ఏంటి? అంతలా ప్రేమించే భర్తకు ఆమె ఎందుకు దూరంగా వెళ్లాలని అనుకుంటుంది? కట్టు బొట్టు ప్రవర్తనలో ఊహించని మార్పు రావడం తన దారి తను చూసుకుంటానని భర్తతో ఆ భార్య ఎందుకు చెప్పింది? వారి బంధాన్ని పరీక్షించిన ఆ అదృశ్య సవాలు ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో శ్రీమతి శ్రీవారు సాగుతుంది.
సాధారణంగా పిల్లల బాధ్యతల్లో పడి భార్యాభర్తలు తమ గురించి ఆలోచించుకునే సమయాన్ని కోల్పోతుంటారు. తీరా వయసు పైబడ్డాక ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయంలో, వారి మధ్య వచ్చే మనస్పర్థలు లేదా ఆరోగ్య సమస్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది ఇందులో చూపించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంటుంది.
విడగొట్టే పిల్లలు
తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన పిల్లలు చెరో ఒకరిని తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అందులో భాగంగానే ఒకరు తమతో తల్లి ఉండేలా బ్రెయిన్ వాష్ చేస్తారు. దాంతో ఆ భార్య తన భర్తకు దూరంగా ఉండేందుకు సిద్ధమవుతుందని, అలా తల్లిదండ్రులను పిల్లలు విడదీసే కథగా శ్రీమతి శ్రీవారు సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
దర్శకేంద్రుడి నిర్మాణంలో.. అద్భుతమైన కాస్టింగ్
{{/usCountry}}తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన పిల్లలు చెరో ఒకరిని తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అందులో భాగంగానే ఒకరు తమతో తల్లి ఉండేలా బ్రెయిన్ వాష్ చేస్తారు. దాంతో ఆ భార్య తన భర్తకు దూరంగా ఉండేందుకు సిద్ధమవుతుందని, అలా తల్లిదండ్రులను పిల్లలు విడదీసే కథగా శ్రీమతి శ్రీవారు సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
దర్శకేంద్రుడి నిర్మాణంలో.. అద్భుతమైన కాస్టింగ్
{{/usCountry}}తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో క్లాసిక్, కమర్షియల్ చిత్రాలను అందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. శరణ్య తేజు ఈ చిత్రానికి కథను అందించి దర్శకత్వం వహించారు. సుమన్, ప్రగతి దంపతులుగా అద్భుతమైన నటనను కనబరిచారు.
రొటీన్ క్యారెక్టర్లకు భిన్నంగా వీరిద్దరి చుట్టూనే సాగే ఒక ఎమోషనల్ డ్రైవ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వీరితో పాటు జాను వర్మ, రోహిత్, విజయ్ కన్నగోగుల, హృషిత రుక్మిణ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
టెక్నికల్ టీమ్ పనితనం..
ఈ చిత్రానికి టెక్నికల్ టీమ్ కూడా ఎంతో బలాన్ని చేకూర్చింది. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, నాని ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. వెంకట్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోగా.. సాయి మధుకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం కథలోని ఎమోషన్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
ఒక వైపు యూత్ ఫుల్ కంటెంట్ ఓటీటీలను శాసిస్తున్న తరుణంలో, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ శ్రీమతి శ్రీవారు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఓటీటీలో ఆకట్టుకునే సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈటీవీ విన్‌లో శ్రీమతి శ్రీవారు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్ ఓటీటీలో
నేడు అంటే జూలై 12న ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా శ్రీమతి శ్రీవారు ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం 35 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈటీవీ విన్ ఓటీటీ మూవీ శ్రీమతి శ్రీవారు సెలవు దినాల్లో కుటుంబంతో చూసేందుకు బెస్ట్ ఆప్షన్.