...
...
Next Story

Star Maa Serial: స్టార్ మాలో కొత్త మాస్ సీరియల్ సింహరాశి.. హీరో హీరోయిన్లు ఎవరు? కథ, టైమింగ్ వివరాలివే!

Star Maa New Serial: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ మా మరో ఆసక్తికరమైన కొత్త సీరియల్ ‘సింహరాశి’ని తీసుకొస్తోంది. గోకుల్ మీనన్, విభీష జాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్ ప్రోమో తాజాగా విడుదలై అంచనాలను పెంచేసింది.

Published on: Nov 23, 2026, 17:20:13 IST
Advertisement

Star Maa New Serial: టీఆర్పీ రేటింగ్స్‌లో ఎప్పుడూ అగ్రస్థానంలో కొనసాగే స్టార్ మా.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కథలను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘సింహరాశి’ అనే కొత్త ధారావాహికను అధికారికంగా ప్రకటించింది. విడుదలైన తొలి ప్రోమోతోనే ఈ సీరియల్ బుల్లితెర అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.

‘సింహరాశి’ స్టోరీ ఏంటీ?

స్టార్ మాలో కొత్త మాస్ సీరియల్ సింహరాశి.. హీరో హీరోయిన్లు ఎవరు? కథ, టైమింగ్ వివరాలివే! (youtube/starmaa)
స్టార్ మాలో కొత్త మాస్ సీరియల్ సింహరాశి.. హీరో హీరోయిన్లు ఎవరు? కథ, టైమింగ్ వివరాలివే! (youtube/starmaa)

అడవిని శాసించే సింహంలా బయటకు ఎంతో పవర్‌ఫుల్‌గా, కఠినంగా కనిపించే ‘సింహ’ అనే యువకుడి చుట్టూ సింహరాశి సీరియల్ కథ తిరుగుతుంది. చాలా ధైర్యవంతుడైనప్పటికీ అతని మనసు మాత్రం అమ్మ ప్రేమ కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది.

తన జీవితంలో ఉన్న ఆ వెలితిని తీర్చి, తల్లి ప్రేమను పంచే సరైన తోడు అతనికి దొరుకుతుందా అనేది కథలోని ప్రధాన భావోద్వేగ అంశం. ద్వేషానికి, భయానికి మధ్య హీరో హీరోయిన్ల బంధం ఎలా ముడిపడుతుంది, మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయికి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది అనే కోణంలో ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగనుందని ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది.

హీరోగా గోకుల్ మీనన్ రీఎంట్రీ

ఈ సింహరాశి సీరియల్‌లో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన నటుడు గోకుల్ మీనన్ హీరోగా నటిస్తున్నారు. గతంలో ‘జ్యోతి’ సీరియల్‌తో తెలుగు టీవీ రంగంలోకి అడుగుపెట్టిన గోకుల్, ఆ తర్వాత ‘రాధమ్మ కూతురు’లో అరవింద్ పాత్రతో ఇంటింటికీ దగ్గరయ్యారు.

అనంతరం ‘మా అన్నయ్య’ సీరియల్‌లో గంగాధర్‌గా తనదైన నటనతో మెప్పించిన ఆయన, ఇప్పుడు ‘సింహరాశి’ ద్వారా మళ్లీ స్టార్ మా వేదికపై సందడి చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించిన గోకుల్ మీనన్, ఈసారి మాస్ టచ్ ఉన్న సింహ పాత్రలో కొత్తగా ఆకట్టుకోనున్నారు.

విభీష జాను ఎంట్రీ

మాస్ హీరోగా గోకుల్ మీనన్, క్లాస్ హీరోయిన్‌గా విభీష జాను జోడీ చాలా బాగుందంటూ తొలి ప్రోమో చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీరియల్‌లో నటించే ఇతర ముఖ్య తారాగణం వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

టైమింగ్ పై అప్డేట్

‘సింహరాశి’ సీరియల్‌కు సంబంధించి ప్రస్తుతం ప్రోమోను మాత్రమే విడుదల చేసి ‘త్వరలో మీ ముందుకు’ అని స్టార్ మా ప్రకటించింది. దీని కచ్చితమైన ప్రారంభ తేదీ, ప్రసార సమయాన్ని ఛానెల్ యాజమాన్యం ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు.

ప్రస్తుతం స్టార్ మాలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గోదావరి, నువ్వు లేక నేను లేను, ఇల్లు ఇల్లాలు పిల్లలు, పొదరిల్లు, కార్తీక దీపం 2, ఏ దేవి వరమో నీవు, గుండె నిండా గుడి గంటలు వంటి ప్రైమ్ టైమ్ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సింహరాశి’కి ప్రైమ్ టైమ్‌లో కొత్త స్లాట్ కేటాయిస్తారా లేదా మధ్యాహ్నం సమయంలో ప్రసారం చేస్తారా అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks