Jayasudha Summer Holidays OTT Release: వేసవి సెలవులు అనేది ప్రతీ ఒక్కరికీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. బాల్యంలో గడిపిన వేసవి సెలవులు, స్నేహితులతో ఆడుకోవడం, అమ్మమ్మ, తాతయ్యలతో గడపడం, సొంత ఊరికి వెళ్లడం అనేవి ఎప్పటికీ తీపి గుర్తులుగానే ఉంటాయి.
సమ్మర్ హాలీడేస్ ఓటీటీ రిలీజ్

అలాంటి నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను కలిగించేలా ‘సమ్మర్ హాలీడేస్’ అనే చిత్రం రీసెంట్‌గా వచ్చింది. థియేటర్లో సమ్మర్ హాలీడేస్ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు సమ్మర్ హాలీడేస్ ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలో సమ్మర్ హాలీడేస్ ఓటీటీ రిలీజ్‌పై ఓ లుక్కేద్దాం.
ఈ సినిమాతో శ్రీకర్ నయన్ డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన తొలి చిత్రంతోనే దర్శకుడిగా సత్తా చాటుకున్నారు శ్రీకర్ నయన్. 'సమ్మర్ హాలిడేస్' సినిమాతో అందరినీ బాల్యంలోకి తీసుకు వెళ్లారు. గోదావరి ప్రాంతంలోని ఒక సుందరమైన పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. నవంబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 9.7 రేటింగ్ వచ్చింది.
రెండు విభిన్న ప్రపంచాల కథ
హైదరాబాద్‌కు చెందిన ఆర్.వి (అరుణ్ దేవ్) అనే బాలుడు తన వేసవి సెలవుల్లో తన అమ్మమ్మ (జయసుధ) ఊరికి వెళ్లడంతో ఈ చిత్రం మొదలవుతుంది. అక్కడ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కె.వి (రోహన్ రాయ్) అనే బాలుడితో స్నేహం మొదలవుతుంది.
రెండు విభిన్న ప్రపంచాల నుంచి వచ్చినప్పటికీ ఆ అబ్బాయిల మధ్య ఊహించని స్నేహం ఏర్పడుతుంది. ఒక సాధారణ వేసవి సెలవుగా ప్రారంభమైన వారి ప్రయాణం తరగతి గది పరిధిని దాటిన అన్వేషణ, నవ్వులు, సాహసం, జీవిత పాఠాలతో కూడిన ఒక అసాధారణ ప్రయాణంగా మారుతుంది.
బాల్యపు అమాయకత్వాన్ని చాటేలా
{{/usCountry}}రెండు విభిన్న ప్రపంచాల నుంచి వచ్చినప్పటికీ ఆ అబ్బాయిల మధ్య ఊహించని స్నేహం ఏర్పడుతుంది. ఒక సాధారణ వేసవి సెలవుగా ప్రారంభమైన వారి ప్రయాణం తరగతి గది పరిధిని దాటిన అన్వేషణ, నవ్వులు, సాహసం, జీవిత పాఠాలతో కూడిన ఒక అసాధారణ ప్రయాణంగా మారుతుంది.
బాల్యపు అమాయకత్వాన్ని చాటేలా
{{/usCountry}}బాల్యపు అమాయకత్వాన్ని చాటేలా ఈ చిత్రం ఉంటుంది. మానవ సంబంధాలలోని ఆత్మీయతను, స్నేహంలోని సౌందర్యాన్ని ప్రతిబింబించేలా సినిమాని తెరకెక్కించారు. జీవితంలోని అత్యంత విలువైన జ్ఞాపకాలు అత్యంత సాధారణ క్షణాల నుండే పుడతాయని ఈ చిత్రం సున్నితంగా గుర్తు చేస్తుంది.
దర్శకుడు శ్రీకర్ నయన్ మాట్లాడుతూ .. "'సమ్మర్ హాలిడేస్' అనేది బాల్యం, స్నేహం విలువను చాటి చెప్పేలా ఉంటుంది. దర్శకుడిగా నా తొలి చిత్రం కావడంతో ‘సమ్మర్ హాలీడేస్’ నాకెప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. సోనీ లివ్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్‌తో ఈ చిత్రం విస్తృత ప్రేక్షకులకు చేరుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
పిల్లలతో పనిచేయడం
"కుటుంబమంతా కలిసి ఈ చిత్రాన్ని చూసి తమ బాల్యపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటారని కోరుకుంటున్నారు. జీవితంలోని చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని కనుగొనడంలో ఉన్న సౌందర్యాన్ని తిరిగి తెలుసుకునే అవకాశాన్ని ఈ చిత్రం కల్పిస్తుందని సంతోషిస్తున్నాను" అని డైరెక్టర్ శ్రీకర్ నయన్ తెలిపారు.
సీనియర్ హీరోయిన్ జయ సుధ మాట్లాడుతూ .. "‘పిల్లలతో పనిచేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అదొక ఉల్లాసకరమైన అనుభవం అని చెప్పుకోవచ్చు. వారి అమాయకత్వం, సహజత్వం ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రాన్ని నాకు మరింత ప్రత్యేకంగా చేశాయి" అని అన్నారు.
జయసుధ కామెంట్స్
"ఈ చిత్రం తరాల మధ్య బంధాన్ని, ఆనందాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుండటంతో కుటుంబాలను ఒకచోట చేర్చుతుందనే నమ్మకం నాకుంది. వేసవి సెలవుల్లో సృష్టించుకున్న అద్భుతమైన జ్ఞాపకాలను ఈ చిత్రం అందరికీ గుర్తు చేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు" అని నటి జయసుధ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. సోనీ లివ్‌లో సమ్మర్ హాలీడేస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. డిసెంబర్ 4న సోనీ లివ్‌లో సమ్మర్ హాలీడేస్ ఓటీటీ రిలీజ్ కానుంది. తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి సోనీ లివ్ ఓటీటీలో సమ్మర్ హాలీడేస్ మంచి అనుభూతిని ఇవ్వనుంది.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.