Sundeep Kishan Karikaala Movie Pooja Ceremony: షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కరికాల. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ‘కరికాల’ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
రెండు చాప్టర్లుగా కరికాల

‘కరికాల’ మొదటి చాప్టర్ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గురువారం (అక్టోబర్ 15, 2026) నాడు కరికాల చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ సందడి చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి హీరో ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి స్క్రిప్ట్‌ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.
ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు
సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "‘కరికాల’ చిత్ర ప్రారంభోత్సవంలో నేను ముందుగా నా ఫ్రెండ్ ఆదికి థాంక్స్ చెప్పాలి. ఆది ‘శంబాల’ వల్లే యుగంధర్ గారు, రాజశేఖర్ గారు, మహిధర్ గారు పరిచయం అయ్యారు. కథ చెప్పడమే రెండు పార్టులుగా ఉంటుందని వివరించారు. అయితే నాకు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు" అని అన్నారు.
"ఆరేడు నెలలుగా మా దర్శకుడు 24 గంటలు ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. నిర్మాతలు కూడా ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఇలాంటి దర్శక, నిర్మాతలు నాకు దొరకడం ఆనందంగా ఉంది. ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను" అని సందీప్ కిషన్ తెలిపాడు.
ముగ్గురు హీరోయిన్లకు థ్యాంక్స్
{{/usCountry}}"ఆరేడు నెలలుగా మా దర్శకుడు 24 గంటలు ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. నిర్మాతలు కూడా ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఇలాంటి దర్శక, నిర్మాతలు నాకు దొరకడం ఆనందంగా ఉంది. ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను" అని సందీప్ కిషన్ తెలిపాడు.
ముగ్గురు హీరోయిన్లకు థ్యాంక్స్
{{/usCountry}}"మా కథకు ఓకే చెప్పిన సాక్షి, గాయత్రి, కేథరిన్‌లకు థాంక్స్. శ్రీ చరణ్ ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ రెడీ చేస్తున్నారు. ప్రతీ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకెప్పుడూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్" అని పేర్కొన్నాడు హీరో సందీప్ కిషన్.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. "‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలు రాజశేఖర్ గారు, మహిధర్ గారికి థాంక్స్. నాపై నమ్మకం పెట్టుకుని సినిమాకి ఓకే చెప్పిన సందీప్ కిషన్ గారికి థాంక్స్" చెప్పారు.
నాగలోకం, వానర లోకంతో ఊహా ప్రపంచం
"అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుంది. అందమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం అని ఇలా ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతోన్నాం. మేం రెండు పార్టులుగా సినిమాని ప్లాన్ చేశాం. వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేస్తాం" అని డైరెక్టర్ యుగంధర్ ముని పేర్కొన్నారు.
నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ .. "‘మా ‘శంబాల’ సినిమాకి మీడియా సపోర్ట్ చేసింది. అలానే మా ‘కరికాల’ చిత్రాన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వచ్చే వారం నుంచి మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. యుగంధర్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించబోతోన్నారు. కథ విన్న వెంటనే సందీప్ గారు ఓకే చెప్పారు. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని అన్నారు.