బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో నటించడంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్ద చర్చ జరుగుతూనే ఉంటుంది. కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీలు ఇటువంటి హానికరమైన అలవాట్లను ప్రోత్సహించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తుంటారు.

బాలీవుడ్ అగ్ర హీరోలు అయిన అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి తారలు ఇప్పటికే ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, తాజాగా హిందీ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, ఆయనపై గౌరవాన్ని పెంచుతోంది.
ఆరోగ్యమే నా దేవాలయం!
ఇటీవల 'పీపింగ్ మూన్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సునీల్ శెట్టి తాను పొగాకు (టొబాకో) ప్రకటనలకు ఎందుకు దూరంగా ఉంటారో వివరించారు. "నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా ఆరోగ్యం. నా శరీరం సహకరించడం వల్లే చిత్ర పరిశ్రమలో సునీల్ శెట్టి అనే ఒక గుర్తింపు వచ్చింది. నా శరీరాన్ని నేను దేవాలయంగా భావిస్తాను. అలాంటప్పుడు నేనే నమ్మని విషయాన్ని ఇతరులకు ఎలా ప్రచారం చేస్తాను? అలా చేస్తే నాపై నాకే నమ్మకం పోతుంది" అని సునీల్ శెట్టి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
రూ. 40 కోట్లు వదులుకున్నా..
తనకు వచ్చిన ఒక భారీ ఆఫర్ గురించి ప్రస్తావిస్తూ.. "ఒక పొగాకు బ్రాండ్ ప్రకటన కోసం నాకు ఏకంగా రూ. 40 కోట్లు ఆఫర్ చేశారు. నా దగ్గరకు వచ్చిన వారితో.. 'నేను వీటికి లొంగుతానని మీరు నిజంగా అనుకుంటున్నారా?' అని అడిగాను" అని సునీల్ శెట్టి తెలిపారు.
"నాకు డబ్బు అవసరం ఉండవచ్చు. కానీ, నా ఆశయాలను మాత్రం వదులుకోను. నేను పొగాకును ప్రమోట్ చేస్తే నా పిల్లలైన అహన్, అతియా శెట్టి, అల్లుడు కేఎల్ రాహుల్ (క్రికెటర్)కు ఏమని సమాధానం చెబుతాను? నేను బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోయినా, ఇప్పటికీ 17 నుంచి 20 ఏళ్ల యువత నన్ను ఎంతో గౌరవిస్తారు. ఆ అభిమానుల గౌరవాన్ని నేను పోగొట్టుకోలేను. ఆ డీల్ రిజెక్ట్ చేసినప్పటి నుంచి ఎవరూ నా దగ్గరకు అటువంటి ఆఫర్లతో రావడానికి సాహసించడం లేదు" అని సునీల్ శెట్టి వివరించారు.
{{/usCountry}}"నాకు డబ్బు అవసరం ఉండవచ్చు. కానీ, నా ఆశయాలను మాత్రం వదులుకోను. నేను పొగాకును ప్రమోట్ చేస్తే నా పిల్లలైన అహన్, అతియా శెట్టి, అల్లుడు కేఎల్ రాహుల్ (క్రికెటర్)కు ఏమని సమాధానం చెబుతాను? నేను బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోయినా, ఇప్పటికీ 17 నుంచి 20 ఏళ్ల యువత నన్ను ఎంతో గౌరవిస్తారు. ఆ అభిమానుల గౌరవాన్ని నేను పోగొట్టుకోలేను. ఆ డీల్ రిజెక్ట్ చేసినప్పటి నుంచి ఎవరూ నా దగ్గరకు అటువంటి ఆఫర్లతో రావడానికి సాహసించడం లేదు" అని సునీల్ శెట్టి వివరించారు.
{{/usCountry}}ఇలా తన పిల్లలు, అభిమానుల కోసం పొగాకు వంటి బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయలేనని, 40 కోట్ల ఆఫర్‌నే కాలదన్నినట్లు మాస్ రిప్లై ఇచ్చినట్లు స్టార్ హీరో, నటుడు సునీల్ శెట్టి పేర్కొన్నారు. అయితే, గతంలో అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి ప్రకటనలో నటించి ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. కానీ, సునీల్ శెట్టి మొదటి నుంచీ తన పద్ధతి మార్చుకోకుండా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీ
సునీల్ శెట్టి ప్రస్తుతం అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సీ వంటి భారీ తారాగణంతో కలిసి ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ (Welcome To The Jungle) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు, మోస్ట్ అవేటెడ్ మూవీ ‘హేరా ఫేరీ 3’ (Hera Pheri 3) కోసం కూడా సునీల్ సిద్ధమవుతున్నారు.