...
...
Next Story

ఏమాత్రం తగ్గని రజనీకాంత్ క్రేజ్- 15వేలకుపైగా అమ్ముడు పోయిన నరసింహ ప్రీ రిలీజ్ టికెట్స్-25 ఏళ్ల క్రితంలాగే ఇప్పుడు కూడా!

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 12). ఈ సందర్భంగా ఇవాళ థియేటర్లలో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ నరసింహ (తమిళంలో పడియప్ప) రీ రిలీజ్ అయింది. అయితే, కొత్త సినిమా రిలీజ్ తరహాలో నరసింహ ప్రీ రిలీజ్ టికెట్స్ అమ్ముడు పోయి రికార్డ్ క్రియేట్ చేసింది.

Published on: Dec 12, 2025, 18:29:03 IST
Advertisement

సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని 1999 నాటి బ్లాక్‌ బస్టర్ చిత్రం ‘పడయప్ప’ (తెలుగులో నరసింహ) దేశవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. చెన్నైలో 10,000కు పైగా ప్రీ రిలీజ్ టికెట్స్ అమ్ముడు పోయి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

పండుగల సెలబ్రేషన్స్

ఏమాత్రం తగ్గని రజనీకాంత్ క్రేజ్- 15వేలకుపైగా అమ్ముడు పోయిన నరసింహ ప్రీ రిలీజ్ టికెట్స్-25 ఏళ్ల క్రితంలాగే ఇప్పుడు కూడా!
ఏమాత్రం తగ్గని రజనీకాంత్ క్రేజ్- 15వేలకుపైగా అమ్ముడు పోయిన నరసింహ ప్రీ రిలీజ్ టికెట్స్-25 ఏళ్ల క్రితంలాగే ఇప్పుడు కూడా!

అలాగే, మధురైలో హౌస్‌ఫుల్ షోలతో నరసింహ మూవీ కొత్త సినిమా రిలీజ్ రేంజ్‌లో రికార్డులు సృష్టించింది. ఈ చారిత్రక రీ-రిలీజ్‌ను అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగే. ఈసారి అది మరింత ప్రత్యేకమైంది. ఆయన 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని, 1999లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బ్లాక్‌ బస్టర్ చిత్రం 'పడయప్ప' దేశవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ అయింది.

కేవలం రీ-రిలీజ్ అయిన పాత సినిమా మాదిరి కాకుండా, ఇది ఒక కొత్త సినిమా విడుదలైనంత హంగామాను సృష్టించింది. హౌస్‌ఫుల్ బోర్డులు, రికార్డు స్థాయిలో టికెట్ల అమ్మకాలతో థియేటర్లన్నీ రజనీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి.

25 ఏళ్ల కిందట

తమిళనాడులోని మధురైలో ఉన్న 'రిట్జీ సినిమాస్'లో 'పడయప్ప' హౌస్‌ఫుల్ షోతో ప్రారంభమైంది. “మా థియేటర్‌లో #PadayappaInRitzyCinemas హౌస్‌ఫుల్ అయ్యింది. 25 ఏళ్ల కిందట ఎలా ఉండేదో, ఇప్పుడూ అదే స్పందన!” అంటూ థియేటర్ యాజమాన్యం ఆడియన్స్ సినిమా చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

చెన్నైలో 10,000+ టికెట్లు: చెన్నైలోని విష్ణు కమల్ (కమలా సినిమాస్) థియేటర్ ఒక్కదానిలోనే 'పడయప్ప' కోసం ఏకంగా 10,000కు పైగా ప్రీ-రిలీజ్ టికెట్లు అమ్ముడయ్యాయి. "పడయప్ప తుఫాను మొదలైంది. కమలా సినిమాస్‌లో 10,000+ ప్రీ-రిలీజ్ టికెట్లు స్టైల్‌గా క్లియర్ అయ్యాయి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఒకే ఒక్క సూపర్‌స్టార్!" అని వారు ఉద్వేగంగా రాశారు.

అంబత్తూర్‌లోని రాక్కి సినిమాస్‌లో డిమాండ్‌ను తట్టుకోలేక అదనపు షోలను కూడా కేటాయించాల్సి వచ్చింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం, కార్తీ 'వా వాత్తియార్' సినిమా వాయిదా పడటంతో, బుకింగ్‌లు మొదలైన కొద్ది నిమిషాల్లోనే 25 షోలలో 12 షోలు దాదాపు నిండిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే 2,480కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

'పడయప్ప' సినిమాను చూసేందుకు వచ్చిన అభిమానులు కేవలం తమిళనాడులోనే కాదు, బెంగళూరు (కర్ణాటక)లోనూ తరలివచ్చారు. చెన్నైలోని రోహిణి థియేటర్ వద్ద సినిమా ప్రదర్శనకు ముందు డీజేతో రజనీకాంత్ హిట్ పాటలను ప్లే చేశారు. అభిమానులు థియేటర్‌లోకి వెళ్లే ముందు డ్యాన్సులు చేసి సందడి చేశారు.

చెన్నైలోని వెట్రి థియేటర్‌లో రజనీకాంత్ ఎంట్రీ సీన్‌ను చూసిన ఒక అభిమాని ఉద్వేగానికి లోనై.. "కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా.. తలైవా!" అంటూ ఆ సీన్‌ను పోస్ట్ చేశారు.

నరసింహ సీక్వెల్

ఇదిలా ఉంటే, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నరసింహలో రజనీకాంత్‌కు జోడీగా సౌందర్య నటించింది. అలాగే, రమ్యకృష్ణ నీలాంబరిగా అదరగొట్టింది. ఇటీవలే నరసింహ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. ఆ సినిమా టైటిల్‌ను 'నీలాంబరి: నరసింహ 2గా ఫిక్స్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe