...
...
Next Story

Mahesh Babu: మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. కృష్ణ కొడుకును సూప‌ర్‌స్టార్‌ను చేసిన 5 సినిమాలివే..ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Mahesh Babu Birthday: టాలీవుడ్ లో 'సూపర్ స్టార్'గా ఎదిగిన ఘట్టమనేని మహేష్ బాబు బర్త్ డే ఇవాళ. నటశేఖరుడు కృష్ణ తనయుడిగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మహేష్.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోల్లో ఒకరు. మహేష్ కెరీర్ ను మలుపు తప్పిన 5 సినిమాల ఏవి? అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ లుక్కేయండి.

Published on: Aug 9, 2026, 06:06:52 IST
Advertisement

Mahesh Babu Birthday: తెలుగు సినిమా లెజెండ్, నటశేఖర కృష్ణ నటవారసుడిగా వెండితెరకు పరిచయమైనప్పటికీ, మహేష్ బాబు తన సొంత ప్రతిభతోనే చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రితో కలిసి అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన మహేష్, 1999లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ (ఆగస్టు 9) మహేష్ బర్త్ సందర్భంగా.. అతణ్ని సూపర్ స్టార్ ను చేసిన 5 సినిమాలు ఏంటో చూసేయండి.

ఒక్కడు (Okkadu - 2003)

మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. కృష్ణ కొడుకును సూప‌ర్‌స్టార్‌ను చేసిన 5 సినిమాలివే..ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. కృష్ణ కొడుకును సూప‌ర్‌స్టార్‌ను చేసిన 5 సినిమాలివే..ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

గుణశేఖర్ దర్శకత్వంలో ఎం.ఎస్.రాజు నిర్మించిన 'ఒక్కడు' చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. అంతవరకు కేవలం క్లాస్, లవర్ బోయ్ ఇమేజ్‌ ఉన్న మహేష్‌ను పక్కా మాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టిన చిత్రమిది.

కబడ్డీ ప్లేయర్ అజయ్ పాత్రలో మహేష్ ప్రదర్శించిన ఎనర్జీ, ప్రకాష్ రాజ్‌తో వచ్చే సీన్లు, చార్మినార్ సెట్ బ్యాక్‌డ్రాప్, మణిశర్మ సంగీతం ఈ సినిమాను ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), సన్ నెక్స్ట్ ఓటీటీల్లో ఉంది.

అతడు (Athadu - 2005

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అతడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం కంటే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సాధించిన స్థానం అపారమైనది. కాంట్రాక్ట్ కిల్లర్ నందు పాత్రలో మహేష్ బాబు ప్రదర్శించిన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అద్భుతమనే చెప్పాలి.

బుల్లితెరపై అత్యధిక టీఆర్‌పీ (TRP) సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమానుే యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు. ఓటీటీల్లో అయితే ప్రైమ్ వీడియో, ఆహా, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

పోకిరి (Pokiri - 2006)

కొన్ని ప్లాప్‌ల తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దూకుడు' మహేష్ బాబుకు గ్రాండ్ కంబ్యాక్‌ను అందించింది. పోలీస్ ఆఫీసర్ అజయ్ పాత్రలో మహేష్ చూపించిన కామెడీ టైమింగ్, యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూఎస్ (USA) బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల క్లబ్‌ను పరిచయం చేసి, ఓవర్సీస్‌లో మహేష్ బాబును అన్-స్టాపబుల్ కింగ్‌గా నిలబెట్టిన చిత్రం ఇది. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.

శ్రీమంతుడు (Srimanthudu - 2015)

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రంతో మహేష్ బాబు 'జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై నిర్మాతగానూ మారాడు. గ్రామాల దత్తత అనే సామాజిక అంశంతో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయం సాధించడమే కాకుండా, నిజ జీవితంలోనూ ఎంతోమంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకునేలా స్ఫూర్తినిచ్చింది.

ఈ సినిమాతో మహేష్ తన స్టార్ హోదాను సామాజిక బాధ్యతతో జతచేసి సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. శ్రీమంతుడు మూవీ ప్రైమ్ వీడియో, జీ5లో ఉంది.

వారణాసితో

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను పరిశీలిస్తే.. అతను కేవలం రొటీన్ మాస్ సినిమాలకే పరిమితం కాకుండా ప్రతి ఐదేళ్లకు ఒకసారి తన ఇమేజ్‌ను పూర్తిగా రీ-ఇన్వెంట్ చేసుకుంటూ వచ్చాడు. 'పోకిరి'తో కమర్షియల్ మాస్, 'శ్రీమంతుడు'తో మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్‌టైన్మెంట్ ఫార్మాట్‌ లో అదరగొట్టాడు.

ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న వారణాసిలో చేస్తున్నాడు మహేష్. ఈ మూవీతో ఇంటర్నేషనల్ లెవల్లో మహేష్ పేరు వినిపించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks