Suriya Scene 2 Days Worldwide Collection: తెలుగు, తమిళ భాషల్లో పవర్ ఫుల్ మాస్ ఇమేజ్‌తో పాటు అపారమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న హీరో సూర్య బాక్సాఫీస్ వేట మళ్లీ మొదలైంది. ఈ ఏడాది ఇప్పటికే 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' వంటి చిత్రాలతో వరుసగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి జోరు మీదున్న ఆయన, తాజాగా 'సీన్' చిత్రంతో థియేటర్లలోకి వచ్చారు.
దివాళికి ముందే సందడి

దివాళి పండుగ సందడికి ముందే విడుదలైన ఈ సీన్ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సూర్యకు ఉన్న మంచి మార్కెట్ వల్ల తొలి రోజు నుంచే థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి.
రెండు రోజుల్లోనే రూ.81 కోట్లకు పైగా గ్రాస్!
బాక్సాఫీస్ విశ్లేషణ గణాంకాల ప్రకారం.. 'సీన్' చిత్రం రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించింది. భారత్‌లోని 5,687 షోల ద్వారా రెండో రోజు రూ. 20.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలైంది.
ఇందులో తమిళ వర్షన్ నుంచి రూ. 16.50 కోట్లు రాగా, తెలుగు వర్షన్ నుంచి రూ. 3.85 కోట్ల వసూళ్లు నమోదు కావడం విశేషం. తొలి రోజు సాధించిన రూ. 19.15 కోట్లతో కలిపి, ఇప్పటివరకు భారతదేశంలో రెండు రోజుల్లో సీన్ సినిమాకు రూ. 39.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, రూ. 45.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
విదేశాల్లో సైతం సూర్య మానియా గట్టిగా నడుస్తోంది. ఓవర్సీస్‌లో రెండో రోజు రూ. 18 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, మొత్తం విదేశీ గ్రాస్‌ను రూ. 35.75 కోట్లకు పెంచుకుంది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 'సీన్' చిత్రం రూ. 81.65 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్‌ను ఖాతాలో వేసుకుంది.
సూర్య మునుపటి రికార్డులు తిరగరాసిన ‘సీన్’
ఈ ఏడాది సూర్య నటించిన గత రెండు చిత్రాల రెండు రోజుల రికార్డులను 'సీన్' అధిగమించడం విశేషం. 'కరుప్పు' సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 74.91 కోట్లు రాబట్టగా, 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ. 74.47 కోట్లు రాబట్టింది.
{{/usCountry}}ఈ ఏడాది సూర్య నటించిన గత రెండు చిత్రాల రెండు రోజుల రికార్డులను 'సీన్' అధిగమించడం విశేషం. 'కరుప్పు' సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 74.91 కోట్లు రాబట్టగా, 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ. 74.47 కోట్లు రాబట్టింది.
{{/usCountry}}ఇప్పుడు 'సీన్' చిత్రం రెండు రోజుల్లోనే రూ. 81.65 కోట్లు సాధించి సూర్య కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 'కరుప్పు' చిత్రం లాంగ్ రన్‌లో రూ. 310.12 కోట్లు, 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ. 209.46 కోట్లు వసూలు చేశాయి. అదే బాటలో 'సీన్' కూడా త్వరలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వినోదం, సస్పెన్స్ కలగలిపిన కథాంశం
'సీన్' చిత్రంలో సూర్య 'ఇంబరాజ్' అనే పోలీస్ ఆఫీసర్‌గా తనదైన స్వాగ్, మాస్ యాటిట్యూడ్‌తో అలరించారు. ఒక జైలు నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక రహస్యం బయటపడటంతో కథ తీవ్రమైన మలుపు తిరుగుతుంది. ఈ చిత్రంతో నటి నజ్రియా నజీమ్ 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ చిత్రసీమలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.
అలాగే మలయాళ నటుడు, ప్రేమలు హీరో నస్లేన్ కె గఫూర్ ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్య-జ్యోతికల 2D ఎంటర్‌టైన్‌మెంట్, ఝగరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఆనందరాజ్, లాల్, రాజప్రియన్, సురేష్ మతియళగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతోపాటు
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు ఫైట్ సీన్లలో కామెడీని మేళవించి దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీపావళి వరుస సెలవులు కలిసిరానుండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.