...
...
Next Story

Censor: ధురంధర్ 2లో బూతులున్నా సెన్సార్ కత్తెర పడలేదు, అది డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. నటుడు సువీందర్ విక్కీ కామెంట్స్

Suvinder Vicky On Dhurandhar Beep Words Censor: బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ తండ్రిగా నటించిన సువీందర్ విక్కీ దర్శకుడు ఆదిత్య ధర్ సెన్సార్ బోర్డును ఎలా బురిడీ కొట్టించారో తాజాగా వివరించారు.

Published on: Mar 26, 2026, 11:54:28 IST
Advertisement

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కేవలం ఆరు రోజుల్లోనే బాహుబలి రికార్డులను తిరగరాయడం విశేషం.

ఆసక్తికర విషయం

ధురంధర్ 2లో బూతులున్నా సెన్సార్ కత్తెర పడలేదు, అది డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. నటుడు సువీందర్ విక్కీ కామెంట్స్
ధురంధర్ 2లో బూతులున్నా సెన్సార్ కత్తెర పడలేదు, అది డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. నటుడు సువీందర్ విక్కీ కామెంట్స్

అయితే, ధురంధర్ 2 సినిమాలో వాడిన పదజాలంపై తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) తండ్రి బ్రిగేడియర్ జహంగీర్‌గా నటించిన సువీందర్ విక్కీ సెన్సార్ బోర్డు కళ్లుగప్పి బూతు పదాలను ఎలా ఉపయోగించారో వెల్లడించారు.

ఇలాంటి కఠినమైన పదజాలాన్ని

మిర్చి ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సువీందర్ విక్కీ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. "నేను నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి కఠినమైన పదజాలాన్ని ఎప్పుడూ వాడలేదు. అందుకే ఆ సీన్ చేసే ముందు ఆదిత్యను అడిగాను.. ‘పాజీ, నిజంగా ఇన్ని బూతులు అవసరమా? మరీ ఇంతగానా?’ అని సందేహం వ్యక్తం చేశాను" అని ఆయన తెలిపారు.

"బీప్" పడకుండానే బూతులు!

దానికి ఆదిత్య ధర్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం సువీందర్‌ను ఆశ్చర్యపరిచిందట. "పాజీ, నేను స్క్రిప్ట్‌లో కేవలం సెన్సార్ బోర్డు బీప్ వేయని బూతులను మాత్రమే రాశాను. మీరు సినిమా చూసేటప్పుడు గమనించండి.. ఒక్క చోట కూడా బీప్ సౌండ్ వినిపించదు" అని ఆదిత్య ధర్ ధీమాగా చెప్పారు.

ఆదిత్య రీసెర్చ్ చూసి తాను ముగ్ధుడనయ్యానని సువీందర్ విక్కీ కొనియాడారు. అలా ధురంధర్ 2లో బూతులున్నా డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ వల్ల సెన్సార్ కత్తెర పడలేదని సువీందర్ చెప్పుకొచ్చారు.

ఇర్ఫాన్ ఖాన్‌తో పోలిక..

సువీందర్ విక్కీ పంజాబీ చిత్రాల ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటికీ, 2023లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వచ్చిన ‘కోహ్రా’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఉడ్తా పంజాబ్’ సినిమాతోపాటు ‘పాతాళ్ లోక్’ వంటి ఓటీటీ సిరీస్‌లో సువీందర్ విక్కీ నటించారు. నెటిజన్లు ఆయన నటనను దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌తో పోల్చడం విశేషం.

రికార్డుల సునామీ..

ఇకపోతే ప్రస్తుతం ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రం దేశీయంగా ఇప్పటివరకు రూ. 643 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మార్కును దాటి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది ధురంధర్ 2 సినిమా. బాహుబలి లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా ఈ చిత్రం అధిగమించడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks