...
...
Next Story

Taapsee Casting: ప్రతిసారి అవే ముఖాలా? స్టార్ డైరెక్టర్లను నిలదీసిన తాప్సీ పన్ను- క్యాస్టింగ్ విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు!

Taapsee Pannu On Directors About Casting: టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీ పన్ను తాజాగా చిత్ర పరిశ్రమలోని క్యాస్టింగ్ పద్ధతులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకే రకమైన పాత్రలకు పదే పదే ఒకే రకమైన హీరోయిన్స్‌ను ఎంచుకోవడంపై దర్శకులను సూటిగా ప్రశ్నించారు తాప్సీ.

Published on: Feb 26, 2026, 10:22:49 IST
Advertisement

గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన 'అస్సీ' (Assi) చిత్రంతో హీరోయిన్ తాప్సీ పన్ను మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో 'ముల్క్', 'థప్పడ్' తర్వాత ఆమె చేసిన మూడవ సామాజిక చిత్రం ఇది.

సీరియస్ పాత్రలు

ప్రతిసారి అవే ముఖాలా? స్టార్ డైరెక్టర్లను నిలదీసిన తాప్సీ పన్ను- క్యాస్టింగ్ విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు! (PTI)
ప్రతిసారి అవే ముఖాలా? స్టార్ డైరెక్టర్లను నిలదీసిన తాప్సీ పన్ను- క్యాస్టింగ్ విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు! (PTI)

అయితే, వరుసగా సీరియస్ పాత్రలు చేస్తున్న తాప్సీ పన్ను తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులు అనుసరిస్తున్న తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె మరోసారి వైరల్ అవుతున్నారు.

క్యాస్టింగ్ విషయంలో కంఫర్ట్ జోన్ వదలరా?

టాప్ డైరెక్టర్లను కలిసినప్పుడు తాను వారితో జరిపిన సంభాషణల గురించి తాప్సీ వివరించారు. "ఒక పాత్ర గురించి ఆలోచించినప్పుడు మన దర్శకులు వెంటనే తమ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లిపోతారు. ‘ఫలానా పాత్రకు ఫలానా వారైతే బాగుంటారు’ అని ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు" అని తాప్సీ అన్నారు.

అలా ఆలోచించడం చాలా తక్కువ

"అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించించడం అనేది ఇక్కడ చాలా తక్కువ. మొదట నేను వారి దగ్గరకు వెళ్లినప్పుడు.. నేను కేవలం మెయిన్ లీడ్ పాత్రలే కాకుండా, మంచి ప్రాధాన్యత ఉన్న ఇతర పాత్రలు కూడా చేస్తానని నమ్మించాల్సి వస్తోంది" అని తాప్సీ పేర్కొన్నారు.

దర్శకుల బద్ధకమే కారణమా?

దర్శకులు పదే పదే ఒకే రకమైన నటులను ఎంచుకోవడంపై తాప్సీ సూటిగా ప్రశ్నిస్తున్నారు. "ఒకే ముఖాలను ఒకే రకమైన పాత్రలకు ఎందుకు తీసుకుంటారు? ఇది ఇతర నటీనటులకే కాదు, కొత్తగా ఏదైనా చేయాలనుకునే నావంటి వారికి కూడా అన్యాయం చేయడమే" అని తాప్సీ తెలిపారు.

అసమర్థత లేదా బద్ధకం

కాగా, తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ పన్నూ 'చష్మే బద్దూర్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'బేబీ', 'పింక్', 'థప్పడ్' వంటి సినిమాలతో తనకంటూ ఒక బలమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు.

తాప్సీ పన్ను సినిమాలు

షారుఖ్ ఖాన్ 'డంకీ', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా', 'ఖేల్ ఖేల్ మే' వంటి చిత్రాలతో అలరించిన తాప్సీ పన్నూ ప్రస్తుతం విలక్షణమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం సమస్యల చుట్టూ తిరిగే సినిమాలే కాకుండా కాస్త తేలికపాటి (Lighter roles) పాత్రలు కూడా చేయాలని ఉందని తాప్సీ పన్ను తన మనసులోని మాటను బయటపెట్టారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks