...
...
Next Story

ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు, తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి: తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్

Tammareddy Bharadwaja On Water Issue Telugu Heroines: ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ వీఎన్ ఆదిత్య చేతుల మీదుగా సర్కారు బాయి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో నీటి కొరత, తెలుగు హీరోయిన్లపై తమ్మారెడ్డి కామెంట్స్ చేశారు.

Published on: Jun 5, 2026, 14:21:46 IST
Advertisement

Tammareddy Bharadwaja On Water Issue Telugu Heroines: తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా విడుదల చేశారు.

ముఖ్య అతిథులుగా తమ్మారెడ్డి, వీఎన్ ఆదిత్య

ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు, తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి: తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్
ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు, తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి: తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని సర్కారు బాయి పోస్టర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు లారా దర్శకత్వం వహించారు.

తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయిన్లుగా నటించిన సర్కారు బాయి సినిమాకు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో 80 దశకంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే, సర్కారు బాయి ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో నీటి సమస్య, తెలుగు హీరోయిన్లపై తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ చేశారు.

ఒక ప్రాంతానికే పరిమితం కాదు

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. “నీటి సమస్య అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి కీలకమైన అంశాన్ని కథాంశంగా తీసుకుని సినిమా రూపొందించడం ఆనందంగా ఉంది” అని అన్నారు.

మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నా

“ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను. చిత్ర యూనిట్‌కు నా హృదయపూర్వక అభినందనలు” అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

అభిమాన క్రికెటర్ లారా లాగానే

“తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అంశాలతో కూడిన కథలంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి కథలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు లారా గారికి కృతజ్ఞతలు. నిర్మాత ప్రఫుల్ రాంరెడ్డి మాకు కుటుంబ పెద్దలాంటివారు. ఈ చిత్రంలో భాగస్వామి కావడం గర్వంగా ఉంది” అని హీరో శ్రీరామ్ నిమ్మల తెలిపారు.

జాతీయ అవార్డు స్థాయి సినిమా

“నేను తెలుగమ్మాయిని. ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ కథ విన్న వెంటనే ఇది జాతీయ అవార్డు స్థాయి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. ప్రేక్షకులందరూ ఈ చిత్రానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని హీరోయిన్ వర్షిక కోరారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks