...
...
Next Story

నన్ను టార్గెట్ చేస్తారని తెలుసు, కానీ నిర్మాతను చూస్తే బాధగా ఉంది- షారుక్ ఖాన్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: దళపతి విజయ్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. 'జన నాయగన్' సెన్సార్ చిక్కుల్లో పడటంపై నిర్మాత పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే, తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని స్పష్టం చేశారు. అలాగే, తనకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ స్ఫూర్తి అని పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Published on: Jan 31, 2026, 11:32:17 IST
Advertisement

తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి'గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదలలో ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

నిర్మాత కష్టాల్లో ఉండటం బాధగా ఉంది

నన్ను టార్గెట్ చేస్తారని తెలుసు, కానీ నిర్మాతను చూస్తే బాధగా ఉంది- షారుక్ ఖాన్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: దళపతి విజయ్ (PTI)
నన్ను టార్గెట్ చేస్తారని తెలుసు, కానీ నిర్మాతను చూస్తే బాధగా ఉంది- షారుక్ ఖాన్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: దళపతి విజయ్ (PTI)

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC)తో నడుస్తున్న ఈ జన నాయగన్ పోరాటంపై దళపతి విజయ్ తాజాగా స్పందించారు. ఎన్డీటీవీ (NDTV)కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో విజయ్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ‘జన నాయకన్’ చిత్రం సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడుతుండటంపై విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

"నా వల్ల నా నిర్మాత (KVN ప్రొడక్షన్స్) ఇబ్బందులు పడటం చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడే, నా సినిమాలను టార్గెట్ చేస్తారని నాకు తెలుసు. అందుకు నేను మానసికంగా ఎప్పుడో సిద్ధమయ్యాను" అని దళపతి విజయ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. నిర్మాతలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావించిన సెన్సార్ బోర్డు, తమ వాదన వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని కోరుతూ సుప్రీంకోర్టులో 'కావియట్' దాఖలు చేసింది.

రాజకీయాల్లో షారుక్ ఖాన్ నా రోల్ మోడల్!

రాజకీయాల్లోకి రావడంపై దళపతి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌ను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని విజయ్ తెలిపారు. "షారుక్ ఎంత అద్భుతంగా మాట్లాడతారో నేను గమనిస్తూ ఉంటాను. ఆయన ఉచ్చారణ, మాటల్లో ఉండే స్పష్టత నన్ను బాగా ఆకర్షించాయి. ఆయనను చూసినప్పుడల్లా ఒక వ్యక్తి ఇంత చక్కగా ఎలా మాట్లాడగలడా? అని ఆశ్చర్యపోయేవాడిని" అని విజయ్ వివరించారు.

రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కొవిడ్ సమయం నుంచే మొదలైందని విజయ్ వెల్లడించారు. అలాగే గతేడాది తన కరుర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (సుమారు 41 మంది మృతి) తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆ విషాదం తనను ఇంకా వెంటాడుతూనే ఉందని విజయ్ ఎమోషనల్ అయ్యారు.

ఏదేమైనా, ఈ ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని దళపతి విజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, జన నాయగన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీకి జన నాయగన్ రీమేక్ అని టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks