ఓటీటీలోకి రష్మిక మందన్న లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వచ్చేసింది. హారర్ థ్రిల్లర్ గా తెెరకెక్కిన ‘థామా’ ఇవాళ (డిసెంబర్ 2) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రష్మిక మందన్న ఫస్ట్ టైమ్ నటించిన హారర్ థ్రిల్లర్ ఇది. ఇందులో బేతాళి పిశాచిగా నేషనల్ క్రష్ నటించింది. మంగళవారం ఓటీటీలోకి వచ్చిన థామా స్ట్రీమింగ్ లో ఓ ట్విస్ట్ ఉంది.
థామా ఓటీటీ

రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన థామా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ హారర్ థ్రిల్లర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ప్రస్తుతానికి ఇది రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్లు కూడా దీని కోసం రెంట్ చెల్లించాల్సిందే.
థియేటర్ రెస్పాన్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న బేతాళిగా నటించిన థామా మూవీ అక్టోబర్ 21న దీపావళి సందర్భంగా రిలీజైంది. దీన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లు. థామా సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ పండితుల అంచనా.
హారర్ యూనివర్స్
బేతాళ కథగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ థామా. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావ్, సత్యరాజ్ తదితరులు నటించారు. ఇది మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన అయిదో సినిమా. ఇందులో స్త్రీ, భేడియా, ముంజ్యా, స్ట్రీ 2 సినిమాలు వచ్చాయి. థామాకు ఆదిత్య సర్పోదర్ డైరెక్టర్.
థామా స్టోరీ
{{/usCountry}}బేతాళ కథగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ థామా. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావ్, సత్యరాజ్ తదితరులు నటించారు. ఇది మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన అయిదో సినిమా. ఇందులో స్త్రీ, భేడియా, ముంజ్యా, స్ట్రీ 2 సినిమాలు వచ్చాయి. థామాకు ఆదిత్య సర్పోదర్ డైరెక్టర్.
థామా స్టోరీ
{{/usCountry}}జర్నలిస్ట్ గా పని చేస్తుంటాడు అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా). ఒక రోజు పర్వత ప్రాంతానికి కవరేజ్ కు వెళ్తాడు. అక్కడ ఓ ఎలుగు బంటి దాడి చేస్తుంటే తడ్కా (రష్మిక) వచ్చి కాపాడుతుంది. తడ్కా ఏమో మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న బేతాళ చెందిన పిశాచి. బేతాళ నాయకుడు థామాగా పిలిచే యాక్షసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)ని గుహలో బంధించి ఉంచుతారు. మరి అలోక్ గుహలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అతను కూడా బేతాళుడిగా మారాడా? మరి తడ్కా కథ ఏంటీ? అన్నది థామా మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.