2025లో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 5 మూవీస్ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటాయి. ఆమె రీసెంట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో 2025లో థియేటర్లో రిలీజైన రష్మిక మందన్న సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి.
ఛావా

ఛావా సినిమాతో 2025ను గ్రాండ్ గా స్టార్ట్ చేసింది రష్మిక మందన్న. విక్కీ కౌశల్ శంభాజీగా నటించిన ఈ పీరియాడికల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రంలో యశుబాయిగా రష్మిక తన యాక్టింగ్ తో అలరించింది. ఇది ఫిబ్రవరి 14, 2025న థియేటర్లో రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
సికందర్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో రష్మిక మందన్న కలిసి నటించిన మూవీ సికందర్. ఇదో యాక్షన్ థ్రిల్లర్. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ హిందీ మూవీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అయినా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇందులో సల్మాన్ తో కలిసి రష్మిక యాక్షన్ తో సత్తాచాటింది. ఇది మార్చి 30, 2025న థియేటర్లో రిలీజైంది. ఇప్పుడు సికందర్ సినిమాను కూడా నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
కుబేర
ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ మూవీ కుబేర. దీనికి శేఖర్ కమ్ముల డైరెక్టర్. లక్ష కోట్ల కుంభకోణం కథతో వచ్చింది ఈ సినిమా. తెలుగు, తమిళంలో రూపొందిన కుబేర సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో అమాయక అమ్మాయిగా తన నటనతో మెప్పించింది రష్మిక మందన్న. కుబేర సినిమా జూన్ 20, 2025న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ యూజర్లకు అందుబాటులో ఉంది.
థామా
రష్మిక మందన్న బేతాళ రాక్షసిగా నటించిన మూవీ థామా. ఇది హారర్ థ్రిల్లర్. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న రొమాన్స్ అదిరిపోయింది. వీళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ అక్టోబర్ 21, 2025న థియేటర్లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుంది. ఇప్పుడు థామా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ మూవీ డిసెంబర్ 2 తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
ది గర్ల్ ఫ్రెండ్
{{/usCountry}}రష్మిక మందన్న బేతాళ రాక్షసిగా నటించిన మూవీ థామా. ఇది హారర్ థ్రిల్లర్. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న రొమాన్స్ అదిరిపోయింది. వీళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ అక్టోబర్ 21, 2025న థియేటర్లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుంది. ఇప్పుడు థామా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ మూవీ డిసెంబర్ 2 తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
ది గర్ల్ ఫ్రెండ్
{{/usCountry}}రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇది నవంబర్ 7, 2025న థియేటర్లలోకి వచ్చింది. దీనికి రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఇందులో దీక్షిత్ శెట్టి, రష్మిక, అను ఇమ్మాన్యుయేల్ తదితరులు నటించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.