The Odyssey 3 Weeks Box Office Collection: ప్రపంచ సినిమా చరిత్రలో తనదైన శైలి విజువల్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ బాక్సాఫీస్ వద్ద మరో ఘనత సాధించారు. హోమర్ రాసిన పురాతన గ్రీక్ కావ్య ఆధారంగా ఆయన తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
'డార్క్ నైట్' రికార్డులు ధ్వంసం!

విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ది ఒడిస్సీ సినిమా 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,300 కోట్లకు పైగా) కలెక్షన్ల మార్కును దాటేసింది. థియేటర్లలో మూడు వారాల దిగ్విజయంగా ప్రదర్శన పూర్తి చేసుకున్న 'ది ఒడిస్సీ' ఉత్తర అమెరికాలో 429.6 మిలియన్లు డాలర్లు, ఓవర్సీస్‌లో 578.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
దీంతో మొత్తంగా కలెక్షన్లు 1.009 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2008లో వచ్చి నోలన్ కెరీర్‌లోనే ఐకానిక్ హిట్‌గా నిలిచిన 'ది డార్క్ నైట్' 1.008 బిలియన్ డాలర్లు అంటే 2008లో ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 4,385.8 కోట్లు) లైఫ్‌టైమ్ రికార్డును ఈ సినిమా దాటేసింది. అంటే తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్.
మరో 73 మిలియన్ డాలర్లు మాత్రమే
నోలన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన 'ది డార్క్ నైట్ రైజెస్' (1.081 బిలియన్ డాలర్లు) రికార్డును చేరుకోవడానికి ఈ సినిమాకు మరో 73 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ మాత్రమే అవసరం. నాలుగో వారాంతం ముగిసేసరికి ఈ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'స్పైడర్ మ్యాన్' తుఫానును తట్టుకొని..
నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. తొలి వారంలోనే 500 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ఈ చిత్రానికి, పోటీగా వచ్చిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' నుంచి భారీ పోటీ ఎదురైంది. స్పైడర్ మ్యాన్ 4 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ సాధించడంతో 'ది ఒడిస్సీ' వసూళ్లపై కొంత ప్రభావం పడింది.
{{/usCountry}}నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. తొలి వారంలోనే 500 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ఈ చిత్రానికి, పోటీగా వచ్చిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' నుంచి భారీ పోటీ ఎదురైంది. స్పైడర్ మ్యాన్ 4 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ సాధించడంతో 'ది ఒడిస్సీ' వసూళ్లపై కొంత ప్రభావం పడింది.
{{/usCountry}}ఉత్తర అమెరికాలో రెండో వారంలో సాధించిన 90 మిలియన్ డాలర్ల వసూళ్లు, మూడో వారానికి వచ్చేసరికి 51 మిలియన్ డాలర్లకు తగ్గాయి. అయినప్పటికీ, అంతర్జాతీయంగా ఐమాక్స్ (IMAX) థియేటర్లలో ఉన్న ప్రత్యేకమైన ఆధిపత్యం ఈ సినిమాను కలెక్షన్ల రేసులో గట్టిగా నిలబెట్టింది.
అగ్ర తారల నటన..
ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఇథాకా రాజు ఆడిసియస్ (ఒడిస్సియస్) తన స్వదేశానికి తిరిగి చేరుకోవడానికి పది సంవత్సరాల పాటు చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. ఒడిసియస్‌గా మ్యాట్ డామన్ జీవించగా, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నే హత్వే, కుమారుడు టెలిమాకస్ పాత్రలో టామ్ హాలండ్ నటించారు.
ఆస్కార్ రేసులో ముందంజ!
వీరితో పాటు రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, లుపిటా న్యోంగో, సమంతా మోర్టన్, జెండాయ వంటి హాలీవుడ్ అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణం, విజువల్ గ్రాండ్యూర్, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ బరిలో ప్రధాన విభాగాల్లో నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.