Nani The Paradise 1st Day Worldwide Box Office Collection: తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' థియేటర్లలోకి వచ్చి రావడంతోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
వరల్డ్ వైడ్‌గా 75 కోట్లు

ప్రీమియర్ షోల నుంచే వసూళ్ల పరంపర ప్రారంభించిన ది ప్యారడైజ్ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. నాని కెరీర్‌లోనే ఇది అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా మొదటి స్థానంలో నిలిచింది.
దేశీయంగా, ఓవర్సీస్‌లో కలెక్షన్ల సునామీ
బాక్సాఫీస్ అంకెల వివరాల్లోకి వెళ్తే.. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి వేసిన పెయిడ్ ప్రీమియర్ల ద్వారానే భారత్‌లో ఈ సినిమా రూ.11.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. గురువారం (సెప్టెంబర్ 24) రోజున పూర్తిస్థాయిలో థియేటర్లలోకి వచ్చి మరో రూ.34.60 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.
దీంతో ఒక్క భారత్‌లోనే తొలిరోజు మొత్తంగా ది ప్యారడైజ్ సినిమా రూ.46 కోట్ల నెట్, రూ.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ భారీ వసూళ్లకు తెలుగు వెర్షన్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. డబ్బింగ్ భాషలైన హిందీ, తమిళ వెర్షన్లు రెండూ కలిపి ఇప్పటివరకు రూ.4 కోట్లలోపే వసూలు చేశాయి.
తుడిచిపెట్టేసిన ప్యారడైజ్
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ది ప్యారడైజ్ చిత్రం సంచలనం సృష్టించింది. ప్రీమియర్లు, మొదటి రోజు వసూళ్లు కలిపి అంతర్జాతీయ మార్కెట్‌లో 2 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును తాకింది నాని ది ప్యారడైజ్ సినిమా.
గతేడాది విడుదలైన నాని 'హిట్ 3' సినిమా సాధించిన రూ.40 కోట్ల ఓపెనింగ్ రికార్డును 'ది ప్యారడైజ్' చాలా సునాయాసంగా తుడిచిపెట్టేసింది. తొలిరోజే రూ.75 కోట్లు సాధించడంతో భారతీయ సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ టాప్-40 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో 'ది ప్యారడైజ్' చేరింది.
'బాహుబలి', 'వార్' రికార్డులు క్రాస్
{{/usCountry}}గతేడాది విడుదలైన నాని 'హిట్ 3' సినిమా సాధించిన రూ.40 కోట్ల ఓపెనింగ్ రికార్డును 'ది ప్యారడైజ్' చాలా సునాయాసంగా తుడిచిపెట్టేసింది. తొలిరోజే రూ.75 కోట్లు సాధించడంతో భారతీయ సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ టాప్-40 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో 'ది ప్యారడైజ్' చేరింది.
'బాహుబలి', 'వార్' రికార్డులు క్రాస్
{{/usCountry}}బాలీవుడ్ హిట్ చిత్రం 'స్త్రీ 2' (రూ.80 కోట్లు) రికార్డుకు సమీపంలో నిలిచిన ఈ సినిమా, భారతీయ చిత్రసీమలో బెంచ్‌మార్క్‌గా నిలిచిన 'బాహుబలి: ది బిగినింగ్' (రూ.73 కోట్లు), హృతిక్ రోషన్ 'వార్' (రూ.74 కోట్లు) చిత్రాల తొలిరోజు రికార్డులను సైతం అధిగమించడం విశేషం.
'దసరా' కాంబో మ్యాజిక్.. అసలు కథేంటంటే?
'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం కావడంతో ది ప్యారడైజ్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ విషయానికి వస్తే.. 'ప్యారడైజ్' అనే ఒక ఊహాజనిత ప్రాంతంలో నివసించే 'సవారీ' అనే తెగ ప్రజల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ప్రభుత్వం నుంచి చట్టబద్ధమైన గుర్తింపు పొందడానికి, తమను దోచుకుంటున్న ఒక దౌర్జన్యకరమైన భూస్వామ్య వర్గం నుంచి తప్పించుకోవడానికి ఆ తెగ చేసే ఆత్మగౌరవ పోరాటమే ఈ సినిమా.
విజయంవైపు ది ప్యారడైజ్
ఇక ది ప్యారడైజ్ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించారు. విమర్శకుల నుంచి కొన్ని నెగెటివ్ అభిప్రాయాలు వచ్చినప్పటికీ, మాస్ ఆడియన్స్ ఆదరణతో ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది.