...
...
Next Story

The Paradise: నెగెటివ్ టాక్ వచ్చినా 60 కోట్ల కలెక్షన్స్- తొలిరోజు నాని ది ప్యారడైజ్ విధ్వంసం-పాత రికార్డులన్నీ గాల్లోకి!

Nani The Paradise Box Office Collection Day 1: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ తొలిరోజే రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ నాని కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించి సంచలనం రికార్డ్‌ని నమోదు చేసింది ది ప్యారడైజ్ సినిమా.

Published on: Sep 24, 2026, 22:29:48 IST
Advertisement

Nani The Paradise 1st Day Worldwide Box Office Collection: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమాకు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది.

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్

నెగెటివ్ టాక్ వచ్చినా 60 కోట్ల కలెక్షన్స్- తొలిరోజు నాని ది ప్యారడైజ్ విధ్వంసం-పాత రికార్డులన్నీ గాల్లోకి!
నెగెటివ్ టాక్ వచ్చినా 60 కోట్ల కలెక్షన్స్- తొలిరోజు నాని ది ప్యారడైజ్ విధ్వంసం-పాత రికార్డులన్నీ గాల్లోకి!

భారీ అంచనాల నడుమ ఇవాళ (సెప్టెంబర్ 24) థియేటర్లలో విడుదలైన ది ప్యారడైజ్ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంటున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సెన్సార్ బోర్డు నుంచి 'ఏ' (A) సర్టిఫికేట్ పొందినప్పటికీ, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది.

తొలిరోజు అత్యధిక కలెక్షన్స్

బుధవారం (సెప్టెంబర్ 23) నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్లతో పాటు గురువారం (సెప్టెంబర్ 24) నాటి షోలతో నాని కెరీర్‌లోనే అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది.

రూ.34 కోట్లకు పైగా వసూళ్లు

ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం 'ది ప్యారడైజ్' సినిమా మొదటి రోజు భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 34.51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దేశవ్యాప్తంగా దాదాపు 9,574 షోలు ప్రదర్శించగా, సగటున 47 శాతానికి పైగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది.

59 శాతానికి పైగా ఆక్యుపెన్సీ

తెలుగు రాష్ట్రాల్లో ది ప్యారడైజ్ సినిమాకు బ్రహ్మాండమైన వసూళ్లు రాగా, హిందీ బెల్ట్‌లోనూ మెరుగైన ఆదరణ లభించింది. కోలీవుడ్‌లో వసూళ్లు కాస్త మందకొడిగా ప్రారంభమైనప్పటికీ, రోజంతా థియేటర్లలో 59 శాతానికి పైగా ఆక్యుపెన్సీ కొనసాగడం విశేషం.

పాత రికార్డులన్నీ గాల్లోకి

ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'సరిపోదా శనివారం' రూ.9 కోట్లు, 'హాయ్ నాన్న' రూ.4.90 కోట్లు సాధించాయి. 'హిట్ 3' కూడా 'ఏ' సర్టిఫికేట్ పొంది రూ.21 కోట్లతో ముగించగా, 'ది ప్యారడైజ్' ఏకంగా రూ.34.51 కోట్లతో నాని కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనర్‌గా సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది.

ది ప్యారడైజ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇదిలా ఉంటే, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇండియాలో రూ. 23.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ప్రీమియర్స్ ద్వారా ఇండియాలో 12.5 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్స్ అన్ని కలిపి రూ. 55 నుంచి 60 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ బాక్సాఫీస్ సైట్స్ పేర్కొన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks