...
...
Next Story

Top OTT: ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకూడని రిలీజ్‌లు ఇవే.. తెలుగు టు హిందీ.. ఒక్కో భాష‌లో ఒక్కోటి.. ఓ లుక్కేయండి!

Top OTT: ఈ వారం ఓటీటీలో సందడి మామూలుగా లేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా ప్రతి ఒక్క భాషలో ఓ టాప్ రిలీజ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ లో అస్సలు మిస్ అవ్వకూడని రిలీజ్ లు ఇవే. వెంటనే ఓ లుక్కేయండి. వీకెండ్ ను ఎంజాయ్ చేయండి.

Published on: Oct 24, 2026, 21:46:13 IST
Advertisement

Top OTT: ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోకి సరికొత్త వినోదం వచ్చి చేరింది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు, నేరుగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సిరీస్‌లతో ఓటీటీ స్పేస్ కళకళలాడుతోంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు కన్నడ, మలయాళ భాషలకు చెందిన ఐదు క్రేజీ రిలీజ్ లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.

డోరతీ (Dorothy)

ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకూడని రిలీజ్‌లు ఇవే.. తెలుగు టు హిందీ.. ఒక్కో భాష‌లో ఒక్కోటి.. ఓ లుక్కేయండి!
ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకూడని రిలీజ్‌లు ఇవే.. తెలుగు టు హిందీ.. ఒక్కో భాష‌లో ఒక్కోటి.. ఓ లుక్కేయండి!

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ ఎమోషనల్ క్రైమ్ డ్రామా డోరతీ. థియేటర్ల తర్వాత అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది విడుదలైంది.

• కథేంటంటే: 1990ల నాటి మధురై నేపథ్యంలో సాగే కథ ఇది. ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితాల్లోకి డోరతీ (కీర్తి సురేష్) అనే ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ అడుగుపెడుతుంది. సమాజంలోని పురుషాధిక్యతను ఎదిరించి నిలబడే ఆమె వల్ల వారి జీవితాలు, ఆలోచనలు ఎలా మారాయి? ఆ తర్వాత తలెత్తిన కుటుంబ కలహాలు, లింగ గుర్తింపు చుట్టూ ఈ కథ నడుస్తుంది.

ది ప్యారడైజ్ (The Paradise)

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ 'ది ప్యారడైజ్'. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

• కథేంటంటే: ఇదొక పీరియడ్ యాక్షన్ డ్రామా. థియేటర్ వెర్షన్ కంటే 24 నిమిషాల నిడివిని తగ్గించి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నాని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, విజువల్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్ మూవీగా నిలబెట్టాయి. మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.

ధూమకేతు (DhoomaKethu)

• కథేంటంటే: కుట్టన్ (సజిన్ గోపు) అనే యువకుడు తన పెళ్లి రోజు ఉదయాన్నే ఒక వింత కల కని మేల్కొంటాడు. అందులో అతను చనిపోయినట్లు చూస్తాడు. ఆ తర్వాత పెళ్లి వేడుకల్లో జరిగే ప్రతి సంఘటన అతనికి ముందే జరిగినట్లు అనిపిస్తుంది. అలా అతను ఒకే రోజులో (Time-loop) ఇరుక్కుపోతాడు. ఆ లూప్ నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనేది ఉత్కంఠ పంచుతుంది.

అయ్యన మనె 2 (Ayyana Mane 2)

రమేష్ ఇందిర దర్శకత్వంలో కుషీ రవి, మానసి సుధీర్, అక్షయ్ నాయక్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కన్నడ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. 'అయ్యన మనె' సీజన్ 2 అక్టోబర్ 23 నుంచి జీ5 ప్లాట్‌ఫారమ్‌లో అదుబాటులోకి వచ్చింది.

• కథేంటంటే: ఒక పెద్ద వంశానికి చెందిన పురాతన ఇల్లు (అయ్యన మనె) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఇంట్లో జరిగే రహస్య మరణాలు, ఒక పవిత్రమైన విగ్రహానికి ఉన్న శాపం, మహాలయ అమావాస్య సమయానికి ఆ ఇంట్లో నిద్రలేచే ఒక భయంకరమైన శక్తి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే సస్పెన్స్ డ్రామా ఇది.

గజబ్ రాత్ (Gajab Raat)

వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్‌లో నిరజ్ పాండే నిర్మాణంలో, రితేష్ షా దర్శకత్వంలో వచ్చిన హిందీ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్'. ఈ చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది.

• కథేంటంటే: ఢిల్లీ నగరంలో ఒకే ఒక్క రాత్రి జరిగే హై-డ్రామా ఇది. లంచాలు తీసుకునే ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ అజయ్ నివృత్ (మనోజ్ బాజ్‌పాయ్) ఒక రాత్రి అనుకోకుండా గాయపడిన జర్నలిస్ట్ ఆర్యను కాపాడతాడు. ఆ తర్వాత మెడికల్ మాఫియా, వ్యాక్సిన్ స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల కుట్రలోకి అతణ్ని లాగుతారు. ఆ రాత్రి అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేది సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ను కలిగిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks