ఈ వారం ఓటీటీలోకి వచ్చిన కొత్త తెలుగు సినిమాల సంఖ్య తక్కువే. ఇందులో ఈ మూడు చిత్రాలు చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలోకి తెలుగులో సైకో కిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ నుంచి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వరకూ ఉన్నాయి. ఈ స్పెషల్ సినిమాలు వీకెండ్ కు బెస్ట్.
దండోరా ఓటీటీ ఓటీటీ

ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాల గురించి చెప్పకుంటే ముందుగా దండోరా మూవీ గురించి మాట్లాడుకోవాలి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో దండోరా సినిమా పేరు ఎక్కువగా వినిపించింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
దండోరా సినిమాకు పాజిటివ్ టాక్ వినిపించింది. ఈ చిత్రంలో శివాజీతో పాటు బిందు మాధవి, రవి కిషన్, నందు, నవదీప్ తదితరులు నటించారు.
గుర్రం పాపిరెడ్డి ఓటీటీ
తెలుగులో రీసెంట్ గా వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్ గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమాలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం ఆశపడే గ్యాంగ్ సమాధుల్లోని శవాలను మార్చాలని అనుకుంటుంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుంటాడు. సమాధుల్లోని శవాలని మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ సక్సెస్ అయిందా? లేదా అనదే గుర్రం పాపిరెడ్డి సినిమాలో చూడాల్సిందే.
కిల్లర్ ఆర్టిస్ట్ ఓటీటీ
{{/usCountry}}అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుంటాడు. సమాధుల్లోని శవాలని మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ సక్సెస్ అయిందా? లేదా అనదే గుర్రం పాపిరెడ్డి సినిమాలో చూడాల్సిందే.
కిల్లర్ ఆర్టిస్ట్ ఓటీటీ
{{/usCountry}}ఈ వారం ఓటీటీలో అదరగొడుతున్న మరో తెలుగు సినిమా కిల్లర్ ఆర్టిస్ట్. ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. సైకో కిల్లర్ చుట్టూ మూవీ తిరుగుతుంది. హత్య చేయడం కూడా ఒక ఆర్ట్ అని, చంపేవాడు ఆర్టిస్ట్ అని నమ్మే కిల్లర్ స్టోరీ ఇది. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది.
బాహుబలి ప్రభాకర్, బిగ్ బాస్ సోనియా ఆకుల తదితరులు నటించిన ఈ సినిమాలో సస్పెన్స్, ట్విస్ట్ లు అదిరిపోయాయి. హీరో సిస్టర్ ను ఎవరో రేప్ చేసి చంపేస్తారు. హీరోయిన్ ముగుసు వేసుకుని అమ్మాయిలను హత్యలు చేస్తున్న హంతకుణ్ని పోలీసులు పట్టుకుంటారు. తన సిస్టర్ ను కూడా అతనే చంపాడని హీరో పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ అప్పుడే ఓ అదిరే ట్విస్ట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే ప్రైమ్ వీడియోలోని కిల్లర్ ఆర్టిస్ట్ చూడాల్సిందే.