ప్రతి వారం ఓటీటీలో కొత్త సందడి ఉంటుంది. ఇందులో తెలుగు సినిమాల వాటా కూడా ఎక్కువే. వివిధ జానర్లలో సినిమాలు తెలుగు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వస్తాయి. ఈ వారం కూడా చాలా తెలుగు మూవీస్ వచ్చాయి. ఇందులో స్పెషల్ గా ఉన్న ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.
ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ

ఈ వారం ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ఇది డిసెంబర్ 25న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఓ సినిమా హీరో అభిమాని చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. తన అభిమాన హీరో వందో సినిమా కంప్లీట్ చేయడానికి రూ.3 కోట్లు అవసరమవుతాయి. ఫ్యాన్ ఆ సాయం చేస్తాడు.
రివాల్వర్ రీటా
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రివాల్వర్ రీటా. ఇది కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అనే మెసేజ్ అందిస్తుంది. ఓ గ్యాంగ్ స్టర్ ను సినిమాలో కీర్తి సురేష్ తల్లి చంపేస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రివాల్వర్ రీటా సినిమాలో కీర్తి సురేష్, రాధికా శరత్ కుమార్, సునీల్ తదితరులు నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
11:11
ఓటీటీలోకి ఈ వారం వచ్చిన మరో తెలుగు సినిమా 11:11. ఇదో మిస్టరీ మర్డర్ థ్రిల్లర్. ఇందులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ 2021లో స్టార్ట్ అయింది. కానీ వివిధ కారణాల వల్ల రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది. చివరకు ఆహా వీడియో ఓటీటీలోకి ఈ వారం నేరుగా రిలీజైంది. ఈ చిత్రంలో ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి హత్యకు గురవుతాడు.
బాహుబలి ది ఎపిక్
{{/usCountry}}ఓటీటీలోకి ఈ వారం వచ్చిన మరో తెలుగు సినిమా 11:11. ఇదో మిస్టరీ మర్డర్ థ్రిల్లర్. ఇందులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ 2021లో స్టార్ట్ అయింది. కానీ వివిధ కారణాల వల్ల రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది. చివరకు ఆహా వీడియో ఓటీటీలోకి ఈ వారం నేరుగా రిలీజైంది. ఈ చిత్రంలో ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి హత్యకు గురవుతాడు.
బాహుబలి ది ఎపిక్
{{/usCountry}}బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలిసింది. బాహుబలి 1, బాహుబలి 2 బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనంగా మారాయో తెలిసింది. ఈ రెండు సినిమాలను కలిపి, రీ మాస్టర్డ్ వర్షన్ గా బాహుబలి ది ఎపిక్ ను థియేటర్లో రిలీజ్ చేశారు మేకర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క కీలక పాత్రలు పోషించారు. ఈ బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.