...
...
Next Story

Top OTT Releases: ఈ వారం ఓటీటీ ధమాకా.. నాని ది ప్యారడైజ్ టు విజయ్-రష్మిక రచ్చ.. మస్ట్ వాచ్ టాప్ ఓటీటీ రిలీజెస్ ఇవే!

Top OTT Releases: మరో కొత్త వారం వచ్చేసింది. ఈ పండగ సీజన్లో డిజిటల్ ఆడియన్స్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అదిరిపోయే కంటెంట్ ను తీసుకొస్తున్నారు. మరి ఈ వారంలో ఓటీటీలోకి రాబోతున్న టాప్ రిలీజ్ లు ఏంటో ఇక్కడ చూసేయండి. ఇందులో నాని ది ప్యారడైజ్ మూవీ నుంచి విజయ్ దేవరకొండ- రష్మిక చేసిన రచ్చ వరకూ అన్నీ ఉన్నాయి.

Published on: Oct 19, 2026, 11:33:15 IST
Advertisement

Top OTT Releases: ఓటీటీ ప్రియులకు ఈ వారం సరికొత్త వినోదం పంచడానికి క్రేజీ సినిమాలు, టాక్ షోలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 19 నుంచి 25 మధ్య డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేయబోతున్న టాప్, మస్ట్ వాచ్ ఓటీటీ రిలీజెస్ వివరాలు మీకోసం.

ది ప్యారడైజ్ (The Paradise)

ఈ వారం ఓటీటీ ధమాకా.. నాని ది ప్యారడైజ్ టు విజయ్-రష్మిక రచ్చ.. మస్ట్ వాచ్ టాప్ ఓటీటీ రిలీజెస్ ఇవే!
ఈ వారం ఓటీటీ ధమాకా.. నాని ది ప్యారడైజ్ టు విజయ్-రష్మిక రచ్చ.. మస్ట్ వాచ్ టాప్ ఓటీటీ రిలీజెస్ ఇవే!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. ఈ మూవీ అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాఘవ్ జుయల్, కాయడు లోహర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి కీలక పాత్రలు పోషించారు.

తన కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అణచివేతపై తిరగబడే 'జడల్' అనే యువకుడి కథే ఇది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కాఫీ విత్ కరణ్ 9 - ఎపిసోడ్ 2 (Koffee With Karan 9)

సెలబ్రిటీల పర్సనల్ ముచ్చట్లను బయటపెట్టే పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9 సరికొత్త ఎపిసోడ్‌తో వస్తోంది. అక్టోబర్ 21 బుధవారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానున్న సెకండ్ ఎపిసోడ్‌లో టాలీవుడ్ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సందడి చేయనున్నారు.

వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'గజబ్ రాత్'. ఒకే ఒక్క రాత్రిలో జరిగే పరిణామాలు, తీసుకునే ఒక నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చేసిందనే కథాంశంతో ఇది తెరకెక్కింది. గతంలో ఈ సినిమాకు 'ఘూస్‌ఖోర్ పండత్' అనే టైటిల్ పెట్టగా, విమర్శల వల్ల 'గజబ్ రాత్'గా మార్చారు.

దర్శకుడు నీరజ్ పాండేతో దాదాపు దశాబ్దం తర్వాత మనోజ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్, దివ్య దత్తా, కికు శారదా, నుష్రత్ భరుచా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

వరం (Varam)

విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన సరికొత్త తెలుగు థ్రిల్లర్ 'వరం'. తీవ్రమైన పేదరికంలో బతికే ఒక వ్యక్తి జీవితం.. అతనికి ఒక వింత వరం అందిన తర్వాత ఎలాంటి ఊహించని మలుపులు తిరిగింది అనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం అక్టోబర్ 22 నుండి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి చిరంజీవి కూతురు సుస్మిత ప్రొడ్యూసర్.

నా వైఫ్ మిస్సింగ్ (Na Wife Missing)

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'నా వైఫ్ మిస్సింగ్'. అక్టోబర్ 22 నుంచి ఇది ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే 'ఆహా గోల్డ్' సబ్‌స్క్రైబర్లకు ఒక రోజు ముందే, అంటే అక్టోబర్ 21 నుంచే ఈ సిరీస్‌ను వీక్షించే ముందస్తు యాక్సెస్ లభించనుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks