స్వచ్ఛమైన తెలుగులో వచ్చే ఓటీటీ కంటెంట్ చాలా అరుదు. ఇతర భాషల నుంచి డబ్బింగ్ ద్వారా ఎన్నో ఓటీటీ మూవీస్ వస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని పల్లె కథలతో అరకొరగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రతి వారం అచ్చమైన తెలుగు కథలుగా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.
3 రూపాయల కోసం

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఓటీటీ రిలీజ్ అయింది అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఆ మూవీనే తొవ్వ. తెలుగు క్యూట్ విలేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. కేవలం మూడు రూపాయల డబ్బు కోసం 12 ఏళ్ల పిల్లాడు పడే పాట్లు ఏంటనే కథాంశంగా తొవ్వ తెరకెక్కింది.
ఎలాంటి దారుల్లో సంపాదించాలి
తొవ్వ అంటే తెలంగాణ మాండలికంలో దారి అనే అర్థం వస్తుంది. అంటే డబ్బును ఎలాంటి దారుల్లో సంపాదించాలనే పాయింట్‌ను ఇన్‌డైరెక్ట్‌గా చెబుతు మనసుకు హత్తుకునే సీన్లతో తొవ్వను తెరకెక్కించారు డైరెక్టర్ రాహుల్ పంచిక.
న్యూస్ పేపర్స్ దొంగతనం
12 ఏళ్ల పిల్లాడు అమ్మ, నాన్న, తాతను మూడు రూపాయలు అడుగుతాడు. ఎవరు ఇవ్వరు. 3 రూపాయల కోసం న్యూస్ పేపర్స్ దొంగతనం చేసి అమ్మాలని చూడటం, జామ పండ్లు అమ్మడం వంటి నానా రకాల పనులు చేస్తాడు. నెల రోజులు కష్టపడితే వచ్చే డబ్బు విలువ గురించి కొడుకు తండ్రి చెప్పడం వంటి సీన్స్ హృద్యంగా ఆకట్టుకుంటాయి.
ఓటీటీలోకి తొవ్వ
అసలు ఆ పిల్లాడికి 3 రూపాయలు ఎందుకు కావాలనే అంశం 90స్ కిడ్స్‌కు మంచి అనుభూతిని కలిగిస్తుంది. డబ్బు కోసం మనం తొక్కే దారులు ఎలాంటివి అనేది లోతైన అర్థంతో ఓ పిల్లాడి చుట్టు అల్లిన ఓ ఫీల్ గుడ్ క్యూట్ స్టోరీనే తొవ్వ. ఇలాంటి తొవ్వ ఓటీటీలోకి వచ్చేసింది.
ఈటీవీ విన్ కథా సుధా
ఇవాళ (జనవరి 4) ఈటీవీ విన్‌లో తొవ్వ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్పటిలా ప్రతివారం లాగే ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ సిరీస్‌లో భాగంగా తొవ్వ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ వీక్లీ ఓటీటీ సిరీస్ నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తొవ్వ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
తొవ్వ నటీనటులు
{{/usCountry}}ఇవాళ (జనవరి 4) ఈటీవీ విన్‌లో తొవ్వ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్పటిలా ప్రతివారం లాగే ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ సిరీస్‌లో భాగంగా తొవ్వ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ వీక్లీ ఓటీటీ సిరీస్ నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తొవ్వ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
తొవ్వ నటీనటులు
{{/usCountry}}ఇకపోతే తొవ్వ సినిమాలో లిటిల్ ఐకాన్, చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాష్ మెయిన్ రోల్ చేశాడు. పూర్ణచంద్ర, మోనిక బూసమ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. క్యూట్ ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకునేవారు నేటి నుంచి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న తొవ్వపై లుక్కేయడం బెటర్.