OTT: ఓటీటీలోకి లవ్ రివేంజ్ డ్రామా సిరీస్ సీజన్ 2- మరింత లోతైన రాజకీయం, అంతర్గత కుట్రలతో ట్రైలర్- తెలుగులోనూ స్ట్రీమింగ్!

Thukra Ke Mera Pyaar Season 2 Trailer Released: ఓటీటీ స్క్రీన్‌పై సెన్సేషన్ సృష్టించిన ఇంటెన్స్ లవ్ అండ్ రివెంజ్ సిరీస్ 'తుక్రా కే మేరా ప్యార్' రెండో సీజన్‌కు ముహూర్తం కుదిరింది. తుక్రా కే మేరా ప్యార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Jun 1, 2026, 14:59:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Series Thukra Ke Mera Pyaar Season 2 Trailer Released: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో రివెంజ్ డ్రామాలకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది. ప్రేమ, ద్రోహం, పగ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ కథలను డిజిటల్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓటీటీ రిలీజ్ అయి భారీ వ్యూవర్‌షిప్ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'తుక్రా కే మేరా ప్యార్' (Thukra Ke Mera Pyaar).

ఓటీటీలోకి లవ్ రివేంజ్ డ్రామా సిరీస్ సీజన్ 2- మరింత లోతైన రాజకీయం, అంతర్గత కుట్రలతో ట్రైలర్- తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఓటీటీలోకి లవ్ రివేంజ్ డ్రామా సిరీస్ సీజన్ 2- మరింత లోతైన రాజకీయం, అంతర్గత కుట్రలతో ట్రైలర్- తెలుగులోనూ స్ట్రీమింగ్!

ఓటీటీలోకి రెండో సీజన్

ఇప్పుడు ఈ ఓటీటీ సిరీస్ రెండో సీజన్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. సంచితా బసు, ధవళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లవ్ అండ్ రివెంజ్ సిరీస్ తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. సూపర్ హిట్ సాధించిన తుక్రా కే మేరా ప్యార్ సిరీస్ సీజన్ 1 తెలుగుతో సహా 7 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్పుడు తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 కూడా తెలుగులో ఓటీటీ రిలీజ్ అవనుంది. జియో హాట్‌స్టార్‌లో తుక్రా కే మేరా ప్యార్ 2 ఓటీటీ రిలీజ్ అవనుంది. జూన్ 19 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో తుక్రా కే మేరా ప్యార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 ట్రైలర్‌ను ఇవాళ సోమవారం (జూన్ 1) రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తుక్రా కే మేరా ప్యార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు.

ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈసారి కథలో కేవలం ప్రేమే కాకుండా రాజకీయం, పవర్‌ గేమ్స్, అంతర్గత కుట్రలు మరింత ఎక్కువ మోతాదులో ఉండనున్నట్లు అర్థమవుతోంది. గతంలో చేసిన తప్పుల వల్ల గిల్టీ ఫీలింగ్‌తో బాధపడుతూనే, మరోవైపు హీరోయిన్‌పై ఉన్న పిచ్చితో కొట్టుమిట్టాడే కుల్దీప్ కుమార్ పాత్రలో ధవళ్ ఠాకూర్ నటన ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అనుకోకుండా పొలిటికల్ ఉచ్చులోకి చిక్కుకున్న ఒక సగటు యువకుడి పోరాటం ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది.

పవర్‌ఫుల్ పాత్రలో సంచితా బసు

మరోవైపు హీరోయిన్ శాన్విక చౌహాన్ పాత్రలో సంచితా బసు మరింత పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించింది. పాత పద్ధతులను పక్కనబెట్టి, అధికార వర్గాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించే బోల్డ్ అమ్మాయిగా ఆమె కనిపిస్తోంది.

ఈ సీజన్ గురించి సంచితా బసు మాట్లాడుతూ.. "ఈసారి శాన్విక పాత్ర మానసికంగా ఎంతో బలంగా, అదే సమయంలో ఊహించని మలుపులతో సాగుతుంది. ప్రేమ, ద్రోహం మధ్య నలిగిపోయే అమ్మాయిగా నటనకు మంచి స్కోప్ దొరికింది. ఈ సీజన్‌లో ప్రతి భావోద్వేగానికి ఒక బలమైన కారణం, పర్యవసానం ఉంటాయి" అని పేర్కొంది.

గతాన్ని మోస్తూ కుల్దీప్..

హీరో ధవళ్ ఠాకూర్ కూడా తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "తన గతాన్ని మోస్తూ, ప్రపంచం తన నుంచి ఏం ఆశిస్తోంది, మనసు ఏం కోరుకుంటోంది అనే గందరగోళంలో కుల్దీప్ పాత్ర సాగుతుంది. ట్రైలర్ కేవలం ఒక చిన్న గ్లింప్స్ మాత్రమే. అసలు కథలో ఎమోషన్స్ చాలా రియలిస్టిక్‌గా, ఇంటెన్స్‌గా ఉంటాయి. మొదటి సీజన్ కంటే దీని స్కేల్ చాలా పెద్దది" అని ధవళ్ తెలిపాడు.

ఆకట్టుకున్న తొలి సీజన్

2024లో విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ మొదటి సీజన్ ఒక పేద అబ్బాయి, ధనవంతురాలైన అమ్మాయి మధ్య సాగే ప్రేమకథగా మొదలైంది. అయితే ఆ తర్వాత సమాజంలో ఉండే అంతస్తుల భేదాలు, అహంకారం, ప్రతీకారం వంటి అంశాల చుట్టూ కథ తిరిగి సూపర్ హిట్‌గా నిలిచింది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

మన తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే 'ఆర్ఎక్స్ 100' తరహా ఇంటెన్స్ లవ్ అండ్ హేట్ ఎమోషన్స్ ఈ ఓటీటీ సిరీస్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ 2లో అంతకంటే ఎక్కువ డ్రామా ఉండనుందని మేకర్స్ ఇస్తున్న భరోసా చూస్తుంటే, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ మరోసారి వ్యూవర్ షిప్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More