Tiger Shroff Get Huge Profit In Real Estate: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఆస్తుల క్రయవిక్రయాల్లో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. 2024 మార్చిలో పుణెలోని హడప్సర్ ఏరియాలో రూ. 7.5 కోట్లకు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత, అంటే 2026 మార్చి 31న అదే ఆస్తిని రూ. 8.87 కోట్లకు విక్రయించారు. ఈ లెక్కన టైగర్ ష్రాఫ్‌కు 1.37 కోట్ల లాభం వచ్చింది.

అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలోనే టైగర్ ష్రాఫ్‌కు 18.3 శాతం మేర లాభం (ROI) లభించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇది అత్యుత్తమ లాభంగా నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇతర పెట్టుబడుల కంటే ఇది రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
విలాసవంతమైన వసతులు.. భారీ ధర
ప్రముఖ బిల్డర్ పంచషీల్ రియాల్టీ నిర్మించిన 'యూ పుణె' (Yoo Pune) ప్రాజెక్టులో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. 4,249 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్‌ను చదరపు అడుగుకు రూ. 20,891 చొప్పున విక్రయించారు. ఈ లావాదేవీలో భాగంగా మూడు పార్కింగ్ స్థలాలను కూడా బదిలీ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం టైగర్ ష్రాఫ్ రూ. 62 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.
అద్దెకు తీసుకున్న వారికే అమ్మకం
ఈ డీల్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫ్లాట్‌ను 'చెరిస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీ కొనుగోలు చేసింది. నిజానికి గతంలో ఇదే కంపెనీకి టైగర్ ష్రాఫ్ నెలకు రూ. 3.5 లక్షల అద్దెకు ఐదేళ్ల కాలపరిమితితో ఈ ఫ్లాట్‌ను లీజుకు ఇచ్చారు. తాజా ఒప్పందంతో అద్దెదారులే ఆ ఆస్తికి యజమానులుగా మారారు. ముంబై, పుణె వంటి నగరాల్లో ఇలాంటి పెద్ద ఎత్తున జరిగే రియల్ ఎస్టేట్ ఒప్పందాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.
రియల్ ఎస్టేట్ బాటలో బాలీవుడ్ స్టార్స్
ఒక్క టైగర్ ష్రాఫ్ మాత్రమే కాదు, గత ఏడాది కాలంగా బాలీవుడ్ అగ్ర తారలంతా తమ ఆస్తుల క్రయవిక్రయాల్లో బిజీగా ఉన్నారు. 2025లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తనకున్న పలు ఆస్తులను ఏకంగా రూ. 100 కోట్లకు పైగా విక్రయించి వార్తల్లో నిలిచారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా గతేడాది సుమారు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను అమ్మేశారు.
{{/usCountry}}ఒక్క టైగర్ ష్రాఫ్ మాత్రమే కాదు, గత ఏడాది కాలంగా బాలీవుడ్ అగ్ర తారలంతా తమ ఆస్తుల క్రయవిక్రయాల్లో బిజీగా ఉన్నారు. 2025లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తనకున్న పలు ఆస్తులను ఏకంగా రూ. 100 కోట్లకు పైగా విక్రయించి వార్తల్లో నిలిచారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా గతేడాది సుమారు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను అమ్మేశారు.
{{/usCountry}}బాంద్రాలోని పాలీ హిల్ ఏరియాలో ప్రీతి జింటా తన అపార్ట్‌మెంట్‌ను మార్చి 2026లో రూ. 18.50 కోట్లకు విక్రయించారు. వీరితో పాటు ప్రభుదేవా, సోనాక్షి సిన్హా వంటి వారు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపును చూసి తమ ఆస్తులను లాభసాటి ధరకు విక్రయిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో, సెలబ్రిటీలు తమ పెట్టుబడులను నగదుగా మార్చుకుంటున్నారు. టైగర్ ష్రాఫ్ సాధించిన ఈ 18 శాతం (రూ. 1.37 కోట్లు) లాభం రియల్ ఎస్టేట్‌లో అతని మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో, ఆర్థిక ప్రణాళిక ఎంత పక్కాగా ఉందో నిరూపిస్తోంది.