OTT Releases: ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ కు గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. ఇవాళ (ఆగస్టు 21) పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్‌లలో క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిల్లో ఈ టాప్ 5 సినిమాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆ టాప్ 5 సినిమాల వివరాలు ఇవే.
జననాయగన్ (Jana Nayagan)

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్'. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఆగస్టు 21 నుంచి జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు నటించిన చివరి చిత్రం కావడంతో ఈ జన నాయగన్ సినిమాపై ఓటీటీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియా జంటగా నటించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ'. పెళ్లి రోజున కాబోయే భర్త విడిచివెళ్లిన నివేదిత అనే యువతి, చెన్నైకి మారిన తర్వాత స్టీవెన్ అనే యువకుడిని కలిసి తన జీవితంలో ఎలా ముందుకు సాగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ చిత్రం సోనీలివ్ వేదికగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
ప్యార్ ప్రేమ కళ్యాణం (Pyaar Prema Kalyanam)
మోడర్న్ వివాహ వ్యవస్థ, కుటుంబ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'ప్యార్ ప్రేమ కళ్యాణం'. పెళ్లి తర్వాత తన సొంతింటిని వదలి వెళ్లడానికి నిరాకరించే పవి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఎలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రసారమవుతోంది.
వెల్కమ్ టు ది జంగిల్ (Welcome to the Jungle)
{{/usCountry}}మోడర్న్ వివాహ వ్యవస్థ, కుటుంబ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'ప్యార్ ప్రేమ కళ్యాణం'. పెళ్లి తర్వాత తన సొంతింటిని వదలి వెళ్లడానికి నిరాకరించే పవి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఎలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రసారమవుతోంది.
వెల్కమ్ టు ది జంగిల్ (Welcome to the Jungle)
{{/usCountry}}అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, అర్షద్ వార్సీ, దిశా పటానీ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన మల్టీస్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'వెల్కమ్ టు ది జంగిల్'. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ నవ్వుల పండగ చిత్రం జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో హిందీ భాషలో వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
డార్క్ (Dark)
మిస్టరీ, థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారి కోసం వచ్చిన తమిళ చిత్రం 'డార్క్'. ఉత్కంఠభరిత కథనంతో సాగే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సింప్లీసౌత్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారమవుతోంది.