...
...
Next Story

OTT Release: దసరా పండగ ఫన్.. ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ మలయాళం రిలీజ్‌లు.. ఓ అదిరిపోయే త‌మిళ సినిమా.. డోంట్ మిస్!

OTT Release: దసరా హాలీడేస్ లో ఓటీటీ ఆడియన్స్ కు అదిరిపోయే ఫన్ అందించేందుకు ఇవాళ ఒకే రోజు రెండు మలయాళం రిలీజ్ లు, ఓ తమిళ మూవీ వచ్చేశాయి. మలయాళంలో తెరకెక్కిన ఓ సినిమా, సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్నీ తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు లేటు.. వెంటనే ఓ లుక్కేయండి.

Published on: Oct 15, 2026, 05:40:31 IST
Advertisement

OTT Release: దసరా సెలవుల్లో వినోదాన్ని పంచేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. నేటి నుంచే (అక్టోబర్ 15, 2026) డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన రెండు సినిమాలు, ఒక క్రేజీ వెబ్ సిరీస్ డిజిటల్ స్క్రీన్స్ పై సందడి చేస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా, సూపర్ నేచురల్ కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ఈ పండగ సెలవులను ఎంజాయ్ చేసేయండి.

ఎన్నా విలై (Enna Vilai)

దసరా పండగ ఫన్.. ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ మలయాళం రిలీజ్‌లు.. ఓ అదిరిపోయే త‌మిళ సినిమా.. డోంట్ మిస్!
దసరా పండగ ఫన్.. ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ మలయాళం రిలీజ్‌లు.. ఓ అదిరిపోయే త‌మిళ సినిమా.. డోంట్ మిస్!

తమిళంలో మంచి విజయం సాధించిన ఎన్నా విలై లీగల్ క్రైమ్ డ్రామా మూవీ నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీ ఇదే

రామేశ్వరానికి చెందిన ఒక సామాన్య మత్స్యకారుడు తవసికి సముద్ర తీరంలో ఒక బంగారు హారం దొరుకుతుంది. అది అతని జీవితాన్ని మార్చేస్తుందని ఆశపడతాడు, కానీ అదే అతని పాలిట శాపంగా మారుతుంది. దొంగతనం నేరంపై తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్లిన అతడిని, ఒక నిజాయితీ గల లాయర్ వ్యవస్థతో పోరాడి ఎలా రక్షించారనేదే ఈ సినిమా కథ.

ఈ ఎన్నా విలై సినిమాలో కరుణాస్, నిమిషా సజయన్, కమలేష్ జగన్ ప్రధాన పాత్రల్లో నటించగా, సజీవ్ పజూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సామ్ సీఎస్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్.

ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ (It's A Medical Miracle)

మలయాళంలో సూపర్ నేచురల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ చిత్రం మనోరమా మాక్స్ (ManoramaMax), సింప్లీ సౌత్ (SimplySouth) ఓటీటీల్లోకి వచ్చేసింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అడుగుపెట్టింది.

కథ ఏంటంటే?

ఈ వింత శక్తి వల్ల అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయి, ఒక నర్సు కోసం అతను చేసిన అన్వేషణ ఏంటి అనే అంశాలను కామెడీ, సస్పెన్స్ జోడించి దర్శకుడు శ్యామిన్ గిరీష్ ఆసక్తికరంగా మలిచారు. ఈ మూవీలో సంగీత్ ప్రతాప్, శరాఫుద్దీన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు పోషించారు.

కాపీ స్క్వాడ్ (Kappi Squad)

యూత్ అండ్ ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సరికొత్త మలయాళ వెబ్ సిరీస్ కాపీ స్క్వాడ్ (Kappi Squad). ఈ సిరీస్ నేటి నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ప్రసారమవుతోంది. ప్రతి గురువారం 4 కొత్త ఎపిసోడ్లు విడుదల కానున్నాయి. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

నలుగురు ఫ్రెండ్స్

నలుగురు ఎమోషనల్, ఇన్ సెక్యూర్డ్ యువతీ యువకులు కలిసి కొచ్చిలో ఒక కేఫ్ ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. ఈ ప్రయాణంలో ఎదురైన ఇగోలు, సవాళ్లు, స్నేహం, ప్రేమ, కామెడీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేటి యువత ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా కాపీ స్క్వాడ్ ను బెల్‌రాజ్ కలరిక్కల్ తెరకెక్కించారు.

ఈ దసరా హాలీడేస్ లో ఇంట్లోనే కూర్చుని ఈ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ చూసి పండగ ఫన్ ను డబుల్ చేసుకోండి!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks