Heroine: నా ముందే బికినీ వేసుకో, నీ బాడీ లాంగ్వేజ్ చెక్ చేయాలన్న దర్శకుడు:క్యాస్టింగ్ కౌచ్‌పై తెలుగు హీరోయిన్ మదాలస శర్మ
Madalsa Sharma About Casting Couch Incident: ముంబై గ్లామర్ ప్రపంచంలోని చీకటి కోణాన్ని తెలుగు హీరోయిన్ మదాలస శర్మ బయటపెట్టారు. ఒక ప్రముఖ దర్శకుడు సినిమా ఛాన్స్ ఇస్తానని పిలిచి, తన ముందే బికినీ వేసుకోవాలని కోరిన చేదు అనుభవాన్ని తాజాగా మదాలస శర్మ పంచుకున్నారు.
Madalsa Sharma About Casting Couch Incident: ప్రముఖ టీవీ సీరియల్ 'అనుపమ'తో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ మదాలస శర్మ తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొని కెరీర్ ఆరంభంలో ఎదురైన వేధింపుల గురించి మాట్లాడారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఒక భారీ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని పిలిచిన దర్శకుడు, కథ గురించి కాకుండా విపరీతమైన కోరికలు కోరడం మొదలుపెట్టాడని మదాలస శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు రంగు బయటపెట్టిన డైరెక్టర్
"సినిమాలో బికినీ వేసుకునే నటి కావాలని ఆయన అడిగారు. కథకు అవసరమైతే బికినీ వేసుకోవడం పెద్ద విషయం కాదని నేను భావించాను. అందుకే సరే అన్నాను. కానీ, ఆ తర్వాత ఆయన (డైరెక్టర్) అసలు రంగు బయటపెట్టారు" అని మదాలస శర్మ ఆనాటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనను గుర్తు చేసుకున్నారు.
బాడీ లాంగ్వేజ్ పేరుతో వంచన
కేవలం బికినీ వేసుకోవడమే కాదు, అది తన ముందే వేసుకోవాలని ఆ దర్శకుడు పట్టుబట్టాడట. "కెమెరా ముందు నువ్వు బికినీలో కంఫర్ట్‌గా ఉంటావో లేదో చూడాలి, నీ బాడీ లాంగ్వేజ్ చెక్ చేయాలి.. అందుకే ఇప్పుడే నా ముందు బికినీ మార్చుకో" అని ఆయన అడిగినట్లు మదాలస శర్మ తెలిపారు. ఈ మాట వినగానే ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అయితే, భయపడి వెనకడుగు వేయకుండా ఆ దర్శకుడికి గట్టి సమాధానం ఇచ్చారు. "నేను వృత్తిరీత్యా నటిని. కథ డిమాండ్ చేస్తే కెమెరా ముందు చీర కట్టినా, లెహంగా వేసినా లేదా బికినీ ధరించినా అది నా బాధ్యత. అది నా వృత్తిలో భాగం. కానీ, మీ వ్యక్తిగత ఆనందం కోసం మీ ముందు బట్టలు మార్చుకోవడం నా వృత్తి కాదు. నా టాలెంట్‌పై నమ్మకం ఉంటే ఛాన్స్ ఇవ్వండి, లేదంటే తలుపు ఎటు వైపు ఉందో నాకు తెలుసు" అంటూ అక్కడి నుంచి గంభీరంగా నడుచుకుంటూ వచ్చేసినట్లు మదాలస శర్మ వివరించారు.
తెర వెనుక అసలు కథ
ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మదాలసకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసిందట. ఆ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన నటి, సదరు దర్శకుడు రిలేషన్‌లో ఉన్నారనే వార్త బయటకు వచ్చింది. అంటే సినిమా ఆఫర్ అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని, ఆ దర్శకుడు యువతుల్ని వేధించేందుకే ఇలాంటి ఆడిషన్లు నిర్వహిస్తారని ఆమెకు అర్థమైంది.
నటిగా స్థిరపడాలనే కోరిక ఉన్నా, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టకూడదని మదాలస శర్మ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 'అనుపమ' సీరియల్‌లో కావ్య పాత్రతో గ్రే షేడ్స్ పండించిన మదాలస శర్మ నిజ జీవితంలో మాత్రం పక్కా క్లారిటీతో వ్యవహరించి ఎందరో యువతులకు ఆదర్శంగా నిలిచారు.
తెలుగులో హీరోయిన్‌గా
ఇదిలా ఉంటే, హిందీ సీరియల్‌లో మెప్పించిన మదాలస శర్మ తెలుగులో హీరోయిన్‌గా చేసి అలరించారు. అల్లరి నరేష్ నటించిన ఫిట్టింగ్ మాస్టర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు మదాలస శర్మ. ఆ తర్వాత హీరో నిఖిల్ ఆలస్యం అమృతం మూవీలో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేశారు బ్యూటిపుల్ మదాలస శర్మ.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


