Mehreen Pirzada Married Photos: టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్లలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు. నాని కృష్ణగాడి వీర ప్రేమకథ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన మెహ్రీన్ ఎఫ్ 2 చిత్రంలో హనీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మెహ్రీన్ ఫిర్జాదా పెళ్లి చేసుకుని టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది.
అర్ష్ ఔలక్ అనే వ్యక్తితో

అర్ష్ ఔలక్ అనే వ్యక్తిని హీరోయిన్ మెహ్రీన్ వివాహం చేసుకుంది. నేడు ఆదివారం (ఏప్రిల్ 26) తన సోషల్ మీడియా ఖాతాలో తన పెళ్లి ఫొటోలను షేర్ చేసింది మెహ్రీన్ పిర్జాదా. ఈ అద్భుతమైన ఫోటోల్లో మెహ్రీన్ లేత గులాబీ రంగు (సాఫ్ట్ పింక్) బ్రైడల్ డ్రెస్ ధరించి, సాంప్రదాయ ఆభరణాలతో మెరిసిపోయింది.
మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌లో
ఇక మెహ్రీన్ భర్త అర్ష్ ఔలక్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. ఈ ఫోటోలలో ఇద్దరూ ఎంతో సంతోషంగా, సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. పాయల్ రాజ్‌పుత్ తదితర సెలబ్రిటీలు అభినందనలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకున్న అర్ష్ ఔలక్ ఏం చేస్తాడు అనే వివరాలు ఇంకా క్లారిటీ లేదు. అలాగే, వీరిద్దరిది లవ్ మ్యారేజా, పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది తెలియాల్సి ఉంది. రష్మిక మందన్నా తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్‌గా మెహ్రీన్ పిర్జాదా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
పాత జ్ఞాపకాలను చెరిపివేస్తూ..
ఇదిలా ఉంటే, మెహ్రీన్ గతంలో హర్యానాకు చెందిన యువ రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 మార్చిలో ఎంతో వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని నెలలకే వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధానికి స్వస్తి పలికారు.
{{/usCountry}}ఇదిలా ఉంటే, మెహ్రీన్ గతంలో హర్యానాకు చెందిన యువ రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 మార్చిలో ఎంతో వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని నెలలకే వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధానికి స్వస్తి పలికారు.
{{/usCountry}}"పరస్పర అంగీకారంతోనే మేము విడిపోతున్నాం. భవిష్యత్తులో ఆయనతో కానీ, ఆయన కుటుంబంతో కానీ నాకు ఎలాంటి సంబంధం ఉండదు" అని అప్పట్లో మెహ్రీన్ ఫిర్జాదా కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఆ చేదు జ్ఞాపకాల తర్వాత ఆమె పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించింది.
మోడలింగ్ నుంచి వెండితెర వరకు
పంజాబీ కుటుంబానికి చెందిన మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, మోడల్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. నాని సరసన 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత 'మహానుభావుడు', 'ఎఫ్-2', 'ఎఫ్-3' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది.
అలాగే, హిందీలో 'ఫిల్లౌరీ' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది బ్యూటిపుల్ మెహ్రీన్ ఫిర్జాదా. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, ఇప్పుడు తన జీవితంలో మెహ్రీన్ మ్యారేజ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
క్లారిటీ రావాల్సి ఉంది
ఇదిలా ఉంటే ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు మెహ్రీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, ఇది కేవలం నిశ్చితార్థమా లేదా పెళ్లి జరిగిపోయిందా అనే విషయంపై మెహ్రీన్ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. కేవలం తేదీని మాత్రమే క్యాప్షన్ ఇచ్చి ఆమె సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏదేమైనా, ఒక విఫలమైన బంధం నుంచి బయటపడి, మెహ్రీన్ మళ్లీ సంతోషంగా కనిపించడం చూసి ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.