...
...
Next Story

Anchor Geetha Bhagat: కొత్త నటీనటులకు అండగా టాలీవుడ్ యాంకర్ గీతా భగత్.. 'ఆరెంజ్ కాస్టింగ్'తో మరో ముందడుగు!

Anchor Geetha Bhagat Orange Casting Agency: టాలీవుడ్‌లో క్రేజీ యాంకర్‌గా పేరు తెచ్చుకుంటున్న గీతా భగత్ మరో ముందడుగు వేశారు. కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించేలా అండగా నిలవనున్నారు. అందుకోసం ఆరెంజ్ క్యాస్టింగ్ అనే ఏజెన్సీని యాంకర్ గీతా భగత్ స్టార్ట్ చేశారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: May 5, 2026, 09:29:29 IST
Advertisement

Anchor Geetha Bhagat Orange Casting Agency: టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు అనగానే ఇప్పుడు ఠక్కున గుర్తొచ్చే పేర్లలో గీతా భగత్ కూడా ఒకరు అని చెప్పాలి. యాంకర్ సుమ తర్వాత ఆ రేంజ్‌లో వాక్చాతుర్యంతో ఆకట్టుకునే యాంకర్ ఈమెనే అనడంలో ఎటువంటి సందేహం లేదని టాలీవుడ్‌లో మంచి టాక్ నడుస్తోంది.

స్టార్స్‌ను ఇబ్బంది పెట్టకుండా

కొత్త నటీనటులకు అండగా టాలీవుడ్ యాంకర్ గీతా భగత్.. 'ఆరెంజ్ కాస్టింగ్'తో మరో ముందడుగు!
కొత్త నటీనటులకు అండగా టాలీవుడ్ యాంకర్ గీతా భగత్.. 'ఆరెంజ్ కాస్టింగ్'తో మరో ముందడుగు!

డీసెంట్‌గా, హుందాగా ఈవెంట్స్‌ను హ్యాండిల్ చేయడం గీతా భగత్ స్టైల్. అంతేకాకుండా తనదైన పంచులతో, స్టార్స్‌ను ఇబ్బంది పెట్టకుండా క్రేజీ ఆన్సర్స్ రాబట్టడంలో కూడా గీతా భగత్‌కు మంచి పేరుంది. టాలవుడ్ యాంకర్‌గా కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

ఆరెంజ్ క్యాస్టింగ్ ఏజెన్సీ

సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండి, సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గీతా భగత్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. టాలెంట్ ఉన్న కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు 'ఆరెంజ్ కాస్టింగ్'(Orange Casting) పేరుతో ఒక కాస్టింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గీతా భగత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

'ఆరెంజ్ కాస్టింగ్' లోగో షేర్ చేస్తూ

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆరెంజ్ కాస్టింగ్' లోగోను షేర్ చేస్తూ గీతా భగత్ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. మంచి విషయాలను అనౌన్స్ చేయడానికి కాస్త లేట్ అయినా పర్వాలేదని చెబుతూ.. "ఆరెంజ్ కాస్టింగ్"ను అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని గీతా భగత్ పేర్కొన్నారు.

కొత్త టాలెంట్‌ను వెతికి పట్టుకుని

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి గీతా భగత్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు, ఇండస్ట్రీ వర్గాలు అభినందనలు తెలుపుతున్నాయి. ఈ కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా టాలీవుడ్‌కు ఎంతమంది కొత్త యాక్టర్స్ పరిచయం అవుతారో చూడాలి.

టాక్ షోలలో యాక్టివ్ యాంకరింగ్

ఇదిలా ఉంటే, తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్లకు కొదవ లేదు. కానీ, తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకోవడంలో గీతా భగత్ సక్సెస్ అయ్యారు. ఆడియో లాంచ్‌లు, సినిమా ఈవెంట్సే కాకుండా బుల్లితెరపై వచ్చే టాక్ షోలలో తన యాక్టివ్ యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు గీతా భగత్.

సోషల్ మీడియా సెన్సేషన్

కేవలం మాటకారి తనమే కాదు, సమయస్ఫూర్తితో గీత చేసే వ్యాఖ్యానాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గీతా భగత్ మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే, గీతా భగత్ కేవలం టీవీ షోలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

గ్లామరస్ ఫొటోషూట్స్

గీతా భగత్ గ్లామరస్ ఫోటోషూట్‌లు, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే షూటింగ్ విశేషాలతో నెటిజన్లను అలరిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నటీనటులతో గీతా భగత్ చేసే ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe