...
...
Next Story

హీరో ధర్మ మహేష్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్- బెంగళూరులో జిస్మత్ మండీ కొత్త బ్రాంచ్ ప్రారంభం- తీర్చిదిద్దిన నగంరం అంటూ!

ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చోట్ల జిస్మత్ మండీ బ్రాంచెస్ ప్రారంభించిన టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేశారు. తాజాగా బెంగళూరులో జిస్మత్ మండీని ధర్మ మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగళూరుతో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ధర్మ మహేష్.

Published on: Feb 8, 2026, 06:53:46 IST
Advertisement

సినీ నటుడు, డ్రింకర్ సాయి మూవీ హీరో, జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ తన వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు బెంగళూరులోని మారతహాళ్లిలో తమ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు ధర్మ మహేష్.

ప్రీమియం ఫుడ్ అందించాలని

హీరో ధర్మ మహేష్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్- బెంగళూరులో జిస్మత్ మండీ కొత్త బ్రాంచ్ ప్రారంభం- తీర్చిదిద్దిన నగంరం అంటూ!
హీరో ధర్మ మహేష్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్- బెంగళూరులో జిస్మత్ మండీ కొత్త బ్రాంచ్ ప్రారంభం- తీర్చిదిద్దిన నగంరం అంటూ!

భోజనం ప్రియులకు ప్రీమియం ఫుడ్ అందిస్తూ చాలా వేగంగా ఎదుగుతున్న జిస్మత్ బిర్యానీ తన కొత్త ఔట్ లెట్‌ను ఘనంగా ప్రారంభించింది. అత్యంత నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కొనసాగుతూనే ఉంటుంది

ఈ సందర్భంగా సినీ నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ.. "జిస్మత్ అనే పేరు నా కుమారుడు పేరులోని భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది నా జీవితంలోనే కాకుండా బ్రాండ్ ప్రయాణంలోనూ ఒక కొత్త అధ్యయనానికి ఆరంభంగా భావిస్తాను. జిస్మత్ లెగసి.. జగద్వాజ.. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది" అని అన్నారు.

వ్యక్తిగతంగా తీర్చిదిద్దిన నగరం

ఇంకా బెంగళూరుతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. “నా జీవితంలో నేను చూసిన తొలి మెట్రో నగరం బెంగళూరే. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నన్ను తీర్చిదిద్దిన నగరం ఇదే” అని ధర్మ మహేష్ అన్నారు.

జీవితానికి అదే మలుపు

ఆయన తన బాల్యాన్ని హనుమాన్ జంక్షన్, గన్నవరం ప్రాంతంలో గడిపిన రోజులను గుర్తు చేస్తూ, చిన్న పట్టణం నుంచి వచ్చిన తనకు మొదట్లో సిటీ లైఫ్‌ను అలవాటు పడటంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయని చెప్పారు. 2008లో తన బావ బెంగళూరుకు తీసుకురావడం తన జీవితానికి మలుపు అని తెలిపారు.

ఆలోచన విధానాన్నే

“కలలు, కష్టపడే తత్వంతో మొదలైన ప్రయాణం ఇక్కడికి రావడం ఎంతో సంతృప్తినిస్తోంది” అని ధర్మ మహేష్ పేర్కొన్నారు. తన ప్రయాణంలో తనకు తోడ్పడిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, నమ్మకమైన కస్టమర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఫ్రెష్ మీట్‌తో

జిస్మత్ మండి ప్రీమియం క్వాలిటీ, హైజీనిక్ అండ్ ఫ్రెష్ మీట్‌తో పాటు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసే రుచికరమైన ఆహారంతో వినియోగదారుల మనసులు గెలుచుకుంటోందని ధర్మ మహేష్ సంతోషం వ్యక్తం చేశారు.

కస్టమర్ సంతృప్తే ముఖ్యం

“ఆరోగ్యం – భద్రత – కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోంది. నాకు లాభాల కంటే కస్టమర్ సంతృప్తే ముఖ్యం. కస్టమర్లు సంతోషంగా ఉంటే విజయం అదే వస్తుంది” అని ధర్మ మహేష్ స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks