Nihal Kodhaty Surya Srinivas About Secret Soldier Movie: తెలుగులో వస్తున్న న్యూ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం సీక్రెట్ సోల్జర్. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
సీక్రెట్ సోల్జర్ కంటెంట్‌కు బజ్

మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సీక్రెట్ సోల్జర్ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సీక్రెట్ సోల్జర్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
హీరోలు నిహాల్, సూర్య సినీ విశేషాలు
యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన సీక్రెట్ సోల్జర్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే, సెప్టెంబర్ 18న సీక్రెట్ సోల్జర్ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
'చైనా పీస్’గా మొదలైన ప్రయాణం ‘సీక్రెట్ సోల్జర్’గా ఎలా మారింది?
-‘చైనా పీస్’ పేరుతోనే టీజర్ రిలీజ్ చేశాను. అలాగే రెండు పాటలు కూడా విడుదల చేశాను. అదే పేరుతో చాలా మార్కెటింగ్ చేశాం. మార్చిలో సినిమా రిలీజ్ చేద్దామని సెన్సార్‌కు పంపించాను. సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి.
-రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు దాటుకుని లిస్టు పంపించారు. అందులో మొదటి పాయింట్.. టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదు. ఈ కథ ఆలోచన, ఉద్దేశంతో ఆలోచించుకుని ‘సీక్రెట్ సోల్జర్’ అయితే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం.
{{/usCountry}}-రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు దాటుకుని లిస్టు పంపించారు. అందులో మొదటి పాయింట్.. టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదు. ఈ కథ ఆలోచన, ఉద్దేశంతో ఆలోచించుకుని ‘సీక్రెట్ సోల్జర్’ అయితే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం.
{{/usCountry}}-సెన్సార్‌లో దాదాపు 8 నెలలు ఈ సినిమా ఉన్నప్పటికీ, మేం ఏ ఆలోచనతో సినిమా తీశామో.. ఆ ఆలోచన విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మా డైరెక్టర్ విశ్వనాథ్ గారు చాలా కష్టపడ్డారు. కంటెంట్ విషయంలో తగ్గించడానికి ఎక్కడా కూడా రాజీ పడలేదు. విజువల్స్ పరంగా చాలా చిన్న కట్స్ మాత్రమే వచ్చాయి.
ఇందులో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుంది?
-ఇది స్పై డ్రామా. ఇందులో స్పై యాక్షన్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది.
ఈ కథ ఏమిటి?
-ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఆ సంఘటనకి నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యను పరిష్కరించగలిగారా లేదా? అనేది ఒక లైన్.
-ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. మా ఇద్దరి క్యారెక్టర్స్ ఈ వరల్డ్‌లోకి ఎలా వచ్చాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మంచి హ్యూమర్, ట్విస్టులు ఉంటాయి. ఫైనల్‌గా సినిమా ఒక మంచి ఫ్రెండ్‌షిప్ కథగా కూడా ఉంటుంది.
-స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్‌తో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇందులో అలాంటి ఒక కొత్త ఎమోషన్‌ను ఆడియన్స్ చూడబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు.
స్పై డ్రామాలో ఇది ఎంత కొత్తగా ఉంటుంది?
-గూఢచారులు ఎప్పుడూ కూడా చాలా సాధారణంగా మన మధ్యనే ఉంటారు. వాళ్లు అసలు గూఢచారులనే సంగతి మనకు అర్థం కాదు. అలా ఉండాలంటే చాలా సహజంగా సన్నివేశాలు ఉండాలి. ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ల ఫ్రెండ్‌షిప్, అలాగే వాళ్ల ప్రయాణం.. డైరెక్టర్ గారు చాలా కొత్తగా రాశారు.
సినిమా ఎవరికైనా చూపించారా?
-మా సినిమాని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చూశారు. అలాగే కొంతమంది తెలియని ఆడియన్స్‌ను తీసుకొచ్చి చూపించాం. చూసిన వాళ్లందరూ కూడా బ్యూటిఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మేము ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూస్తాము. ఆ కోణంలో చూసుకున్నప్పుడు చాలా నచ్చింది. ఇండస్ట్రీలో చూసిన వాళ్లందరూ కూడా ఇది పెద్ద స్టార్స్ చేయాల్సిన సినిమా అని చెప్పారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
-ఈ సినిమాలో చాలా అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ కూడా ఉంది. మాకు కావాల్సినంత సమయం దొరికింది. సినిమాని చాలా క్వాలిటీతో తీశాము. ఇందులో కమల్ కామరాజు, రఘుబాబు గారు, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా చాలా ప్రముఖ నటులు ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా యూనిక్‌గా ఉంటుంది.