తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు నిర్మాత కల్యాణ్. వినూత్న కథలు, కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులకు అవకాశాలు కల్పిస్తూ కొత్త తరహా సినిమాలను నిర్మించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగుతోంది.
అవకాశాలు లభించడం కష్టం

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవాళ్లకు అవకాశాలు లభించడం కష్టంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిభ ఉన్న వారికి సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను స్థాపించినట్లు ప్రొడ్యూసర్ కల్యాణ్ తెలిపారు.
ఆలోచింపజేసే, అలరించే సినిమాలు
"కథే హీరో” అన్న సిద్ధాంతంతో, వినూత్న కథలు, సమకాలీన అంశాలు, ప్రేక్షకులను ఆలోచింపజేసే, అలరించే సినిమాలను నిర్మించడమే తమ లక్ష్యం అని నిర్మాత కల్యాణ్ తెలిపారు.
సరైన వేదిక కల్పించాలనే
నిజమైన ప్రతిభకు సరైన వేదిక కల్పించాలనే బలమైన ఆలోచనతో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఆవిర్భవించిందని, కొత్త దర్శకులు, కొత్త నటీనటులు, టెక్నీషియన్లకు అవకాశాలు ఇస్తూ, కంటెంట్ ఆధారిత సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఈ బ్యానర్‌ను ప్రారంభించామని నిర్మాత కల్యాణ్ అన్నారు.
క్రియేటివిటీకి పూర్తి ప్రాధాన్యత
కొత్త ఆలోచనలకు స్వేచ్ఛ, క్రియేటివిటీకి పూర్తి ప్రాధాన్యం ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలకు కూడా కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పెద్ద పీట వేయనుందని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఆసక్తికర కథలు ఫైనల్ దశలో ఉండగా, తొలి సినిమా వివరాలను సంక్రాంతి సందర్భంగా ప్రకటిస్తామని నిర్మాత కల్యాణ్ వెల్లడించారు.
న్యూ ప్రొడ్యూసర్ కల్యాణ్
ఆ సినిమాల రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా టాలీవుడ్ కొత్త ప్రొడ్యూసర్ కల్యాణ్ తెలియజేశారు. అవకాశాల కోసం ఎదురుచూసేవారికి కల్యాణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ మంచి వేదిక కానుందని తెలుస్తోంది.
{{/usCountry}}ఆ సినిమాల రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా టాలీవుడ్ కొత్త ప్రొడ్యూసర్ కల్యాణ్ తెలియజేశారు. అవకాశాల కోసం ఎదురుచూసేవారికి కల్యాణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ మంచి వేదిక కానుందని తెలుస్తోంది.
{{/usCountry}}