Day 1 Top Highest Share Gross Collection Tollywood Movies: తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ స్టామినా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు వచ్చే వసూళ్లే వారి స్టార్‌డమ్‌కు అసలైన కొలమానంగా మారుతున్నాయి.
లాంగ్ రన్‌లో రికార్డులు

ఒకప్పుడు లాంగ్ రన్‌లో వచ్చే వసూళ్లను రికార్డులుగా పరిగణిస్తే, ఇప్పుడు కేవలం మొదటి రోజే వసూళ్ల సునామీ సృష్టిస్తూ వందల కోట్ల క్లబ్‌లో చేరే స్థాయికి మన సినిమాలు చేరాయి. అయితే, డే 1 రోజున రిలీజ్ అయి అత్యధికంగా షేర్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టాలీవుడ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
'ఆర్ఆర్ఆర్' టాప్.. వేటాడిన 'పుష్ప 2'
తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో గ్లోబల్ ఫినామినన్ 'ఆర్ఆర్ఆర్' రూ. 74.11 కోట్లతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టాప్ 3లో పవన్ కల్యాణ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' రూ. 70.81 కోట్లతో గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. పవన్ కల్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ)' రూ. 64.56 కోట్ల షేర్‌తో మూడో స్థానంలో నిలిచి పవర్ స్టార్ బాక్సాఫీస్ రేంజ్‌ను నిరూపించింది.
పెద్దికి ఐదో స్థానం
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర 1' రూ. 61.65 కోట్లతో నాలుగో స్థానంలో ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది రూ. 54.55 కోట్ల షేర్‌తో టాప్ 5లో సగర్వంగా నిలిచింది. ప్రభాస్ 'సలార్' రూ. 50.49 కోట్లతో ఆ తర్వాతి ఆరో స్థానంలో ఉంది.
వరల్డ్ వైడ్‌గా డే 1 షేర్స్ చూస్తే..
థియేట్రికల్ రిలీజ్ అయిన తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాగా అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ రూ. 160 కోట్లతో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ రూ. 135 కోట్ల షేర్‌తో రెండో స్థానం, రూ. 123 కోట్లతో ప్రభాస్ బాహుబలి 2 టాప్ 3లో నిలిచింది.
టాప్ 8గా పెద్ది
{{/usCountry}}థియేట్రికల్ రిలీజ్ అయిన తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాగా అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ రూ. 160 కోట్లతో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ రూ. 135 కోట్ల షేర్‌తో రెండో స్థానం, రూ. 123 కోట్లతో ప్రభాస్ బాహుబలి 2 టాప్ 3లో నిలిచింది.
టాప్ 8గా పెద్ది
{{/usCountry}}జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 రూ. 98.60 కోట్ల షేర్ వసూళ్లతో టాప్ 4 ఉంటే.. సలార్ రూ. 97.49 కోట్లతో 5వ స్థానంలో, రూ. 96.16 కోట్లతో కల్కి 2898 ఏడీ ఆరో స్థానం దక్కించుకున్నాయి. అలాగే, పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రూ. 90.91 కోట్లతో ఏడో ప్లేసులో ఉంటే రామ్ చరణ్ పెద్ది రూ. 75.65 కోట్ల షేర్‌తో టాప్ 8గా నిలిచింది.
వరల్డ్ వైడ్ డే 1 గ్రాస్ కలెక్షన్స్:
1. పుష్ప 2 ది రూల్- రూ. 285.55 కోట్లు
2. ఆర్ఆర్ఆర్- రూ. 235 కోట్లు
3. బాహుబలి 2- రూ. 215 కోట్లు
4. కల్కి 2898 ఏడీ- రూ. 183.20 కోట్లు
5. సలార్- రూ. 167 కోట్లు
6. దేవర పార్ట్ 1- రూ. 157 కోట్లు
7. ఓజీ- రూ. 145 కోట్లు
8. ఆదిపురుష్- రూ. 137 కోట్లకుపైగా
9. సాహో- రూ. 126 కోట్లు
10. పెద్ది- రూ. 117.20 కోట్లు
ఆ రెండింటి మధ్య
ఇలా తొలిరోజు అధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ మూవీస్ జాబితాలో పుష్ప 2 ది రూల్ సినిమా ఉంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన పెద్ది టాప్ 10 స్థానంలో నిలిచింది. అయితే, తెలుగు స్టేట్స్ షేర్ కలెక్షన్స్‌లో టాప్ 1గా ఆర్ఆర్ఆర్ ఉంటే.. వరల్డ్ వైడ్ షేర్, గ్రాస్ పరంగా మాత్రం పుష్ప 2 ది రూల్ నిలిచి ఈ రెండింటి మధ్యే గట్టి పోటీ ఎదురైంది.