YouTube: యూట్యూబ్‌లో మిస్ అవకూడని బెస్ట్ 10 షార్ట్ ఫిల్మ్స్- మనసుకు హత్తుకోవడం నుంచి ఊహకందని థ్రిల్ పంచేవరకు! హీరోలవే!

Must Watch Best 10 Short Films In YouTube: వీకెండ్ ముగిసి సోమవారం ఆఫీస్ బాట పట్టే వేళ మనసు కాస్త నిస్తేజంగా అనిపించడం సహజమే. హైదరాబాద్ మెట్రోలోనో, బస్సులోనో ప్రయాణిస్తూ ప్రయాణ సమయాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవాలనుకుంటే ఈ బెస్ట్ 10 అద్భుతమైన యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌పై లుక్కేయండి.

Published on: Sep 21, 2026, 12:24:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Must Watch Best 10 Short Films In YouTube: మళ్లీ సోమవారం రానే వచ్చింది. వీకెండ్ సరదాలన్నీ ముగిసిపోయి, మళ్లీ రోజువారీ ఆఫీస్ హడావుడి మొదలైంది. ఉదయాన్నే నిద్రలేవడం, తయారవ్వడం, హైదరాబాద్ లేదా విజయవాడ వంటి నగరాల్లో ఐటీ కారిడార్లు, ఆఫీసుల వైపు వెళ్లే ట్రాఫిక్‌లో ప్రయాణించడం ప్రతీ ఒక్కరికీ సవాలుగా మారుతోంది.

యూట్యూబ్‌లో మిస్ అవకూడని బెస్ట్ 10 షార్ట్ ఫిల్మ్స్- మనసుకు హత్తుకోవడం నుంచి ఊహకందని థ్రిల్ పంచేవరకు! హీరోలవే!
యూట్యూబ్‌లో మిస్ అవకూడని బెస్ట్ 10 షార్ట్ ఫిల్మ్స్- మనసుకు హత్తుకోవడం నుంచి ఊహకందని థ్రిల్ పంచేవరకు! హీరోలవే!

మండే బ్లూస్ నుంచి ఉపషమనం

ఆఫీస్‌కు వెళ్లి కంప్యూటర్ ముందు కూర్చునే లోపే సగం శక్తి ఆవిరైపోయే ఈ 'మండే బ్లూస్' నుంచి బయటపడటానికి ప్రయాణంలో కాస్త సమయాన్ని మనసు ప్రశాంతత కోసం కేటాయించుకోవడమే సరైన పరిష్కారం.

5 నుంచి 15 నిమిషాల బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్

బస్సు లేదా మెట్రో ప్రయాణంలో మీ మూడ్‌ని ఒక్కసారిగా రీఫ్రెష్ చేయడానికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఎంతో ఉపయోగపడతాయి. కేవలం 5 నుంచి 15 నిమిషాల రన్‌టైమ్‌లోనే ఎంతో లోతైన భావాలను, అద్భుతమైన థ్రిల్‌ను పంచే టాప్ 10 యూట్యూబ్ షార్ట్స్ ఫిల్మ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సామాజిక కోణాలు - నిజాన్ని నిలదీసే కథలు

జ్యూస్ (Juice - 2017)-(IMDb రేటింగ్: 8.4): నీరాజ్ ఘైవాన్ దర్శకత్వంలో షెఫాలీ షా నటించిన ఈ చిత్రం ఒక సాధారణ మధ్యతరగతి దావత్ కథతో తెరకెక్కింది. ఇంట్లో మగవాళ్లు హాల్‌లో హాయిగా మద్యం సేవిస్తూ ముచ్చట్లు చెప్పుకుంటుంటే, మహిళలు కిచెన్ ఆవిరిలో మాడిపోతూ వంటింట్లో వంటలు చేస్తుంటారు. మన సమాజంలో వేళ్లూనుకున్న పితృస్వామ్య పోకడలపై ఈ కథ గట్టి దెబ్బ కొడుతుంది.

టూ (Two - 1964)-(IMDb రేటింగ్: 8.0): దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తీసిన అద్భుత మూకీ చిత్రం. సంభాషణలు లేని ఈ సినిమాలో ఇద్దరు చిన్న పిల్లల మధ్య ఉండే ఆర్థిక వ్యత్యాసాన్ని చూపించారు. ధనిక బాలుడు తన భవనం కిటికీ నుంచి చూస్తుంటే, గుడిసెలో ఉండే పేద బాలుడు తన దగ్గరున్న సాధారణ బొమ్మలతో పోటీపడతాడు. మాటలు లేకుండానే మానవ మనస్తత్వాలను అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది.

దట్ డే ఆఫ్టర్ ఎవ్రీడే (That Day After Everyday - 2013)-(IMDb రేటింగ్: 7.4): అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే ప్రధాన పాత్ర పోషించారు. వీధుల్లో ప్రతిరోజూ మహిళలు ఎదుర్కొనే ఈవ్‌టీజింగ్, వేధింపుల నేపథ్యంతో కథ సాగుతుంది. నిశ్శబ్దంగా భరించే బాధితులు చివరకు ఎలా తిరగబడ్డారనేది ఆకట్టుకునేలా ఉంటుంది.

థ్రిల్ ఇచ్చే సైలెంట్ అండ్ సైకలాజికల్ కథనాలు

ది బైపాస్ (The Bypass - 2003)-(IMDb రేటింగ్: 7.6): దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్. రాజస్థాన్ ఎడారిలోని ఒక నిర్మానుష్య రహదారిపై సాగే ఈ కథలో ఒక్క సంభాషణ కూడా ఉండదు. దొంగతనాలు, అవినీతి పోలీసుల క్రూరత్వాన్ని దర్శకుడు అమిత్ కుమార్ దృశ్యాల ద్వారానే ప్రతిబింబించారు.

చట్నీ (Chutney - 2016)-(IMDb రేటింగ్: 7.7): తిస్కా చోప్రా, రసికా దుగల్ నటించిన డార్క్ కామెడీ సస్పెన్స్ చిత్రం. గాజియాబాద్‌కు చెందిన ఒక సాధారణ గృహిణి జీవితం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు ఏంటో చూపిస్తూ, ప్రేక్షక సమూహాన్ని ఆశ్చర్యపరిచే మలుపులతో కథ నడుస్తుంది.

కృతి (Kriti - 2016)-(IMDb రేటింగ్: 7.2): మనోజ్ బాజ్‌పేయి, రాధికా ఆప్టే నటించిన సైకలాజికల్ థ్రిల్లర్. సాపన్ అనే వ్యక్తి కృతి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ కథ ముందుకు సాగే కొద్దీ ఆమె నిజంగా ఉందా లేక అతడి మానసిక భ్రమా అనేది చివరి వరకు సస్పెన్స్‌గా సాగుతుంది.

అనుబంధాలు, భావోద్వేగాల ప్రయాణం

ఇంటీరియర్ కేఫ్ నైట్ (Interior Cafe Night - 2014)-(IMDb రేటింగ్: 7.6): నసీరుద్దీన్ షా, శ్వేతా బాసు ప్రసాద్ నటించిన ఒక మధురమైన ప్రణయ కథ. కలకత్తాలోని ఒక కేఫ్‌లో ఎప్పుడో విడిపోయిన పాత ప్రేమికులు మళ్లీ కలుసుకున్నప్పుడు వారి మనసుల్లో కలిగే భావోద్వేగాలను దర్శకుడు చాలా సున్నితంగా తెరకెక్కించారు.

అనుకూల్ (Anukul - 2017)-(IMDb రేటింగ్: 7.5): సత్యజిత్ రే రాసిన కథ ఆధారంగా సుజోయ్ ఘోష్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా. భవిష్యత్తులో మానవులకు, హ్యూమనాయిడ్ రోబోలకు మధ్య వచ్చే ఘర్షణను ఇది కళ్లకు కడుతుంది. పరంబ్రత ఛటర్జీ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు.

తాండవ్ (Tandav - 2016)-(IMDb రేటింగ్: 7.3): మనోజ్ బాజ్‌పేయి హెడ్ కానిస్టేబుల్ తాంబే పాత్రలో జీవించారు. వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ ఒత్తిళ్ల నడుమ వినాయక నిమజ్జనం బందోబస్తులో ఉండే పోలీసు అధికారి మానసిక ఘర్షణ, అతని ఆగ్రహం ఏ రూపం దాల్చిందనేది ఈ లఘు చిత్రం చూపిస్తుంది.

ట్యూబ్‌లైట్ కా చాంద్ (Tubelight Ka Chand - 2010): శ్లోక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోల్‌కతా వీధుల్లో పెరిగే ఒక అనాథ బాలుడి అమాయకత్వాన్ని చూపిస్తుంది. ఆకాశంలోని చందమామతో ప్రేమలో పడి, దాన్ని సొంతం చేసుకోవడానికి ఆ చిన్నారి చేసే ప్రయత్నాలు మనసును తాకుతాయి. (IMDb రేటింగ్: 7.3)

ఫ్రెష్ మూడ్ కలిగించే

ఈ 10 షార్ట్ ఫిల్మ్స్ చూస్తే మీ ప్రయాణ సమయం తెలియకుండా జరిగిపోవడమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి కావలసిన ఫ్రెష్ మూడ్ లభిస్తుంది. యూట్యూబ్, ప్రముఖ ఓటీటీల్లో ఉచితంగా లభించే ఈ చిత్రాలను మీ వాచ్ లిస్ట్‌లో చేర్చేసుకోండి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More