Sunday OTT: సండేను మూవీ డేగా మార్చాలా? ఇవాళ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ టాప్ 5 సినిమాలపై లుక్కేయండి-ఒక్కో భాషలో ఒక్కోటి!
Sunday OTT: మరో సండే వచ్చేసింది. బయట చూస్తేనేమో వాతావరణం కూల్ గా ఉంది. ఈ చలిలో ఎక్కడికి వెళ్లలేమనుకునే మూవీ లవర్స్ కు ఇంట్లోనే ఓటీటీలో సినీ విందు రెడీగా ఉంది. ఈ సండేను మూవీ డేగా మార్చేందుకు ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవతున్న టాప్ 5 మూవీస్ పై లుక్కేయండి. ఒక్కో భాషలో ఒక్కో సినిమా ఉంది.
Sunday OTT Movies: ఓటీటీలో కొత్త సినిమాలకు కొదవే లేదు. రోజుల తరబడి చూసినా తరగని చిత్రాలున్నాయి. అయితే ఈ మూవీస్ లో బెస్ట్ ఏవీ? టాప్ ఏవీ? ఏ సినిమాలు చూడాలి? అనేది తేల్చుకోవడమే కష్టం. అందుకే ఈ వారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, టాప్ వ్యూస్ తో దూసుకుపోతున్న 5 సినిమాల లిస్ట్ మీ కోసమే ఇక్కడుంది.

తమిళ బ్లాక్ బస్టర్
ముందుగా తమిళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘జైలర్ 2’ గురించి మాట్లాడుకుందాం. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి మరోసారి తలైవా రజినీకాంత్ స్టార్ పవర్ ను చాటింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో స్ట్రీమ్ అవుతోంది.
తెలుగు పీరియాడిక్ థ్రిల్లర్
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెలుగులో వచ్చిన ‘రణబాలి’ సినిమాకు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ దక్కుతోంది. థియేటర్లలో ఫర్వాలేదనిపించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో అదిరే వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇండియాకు ఇండిపెండెన్స్ రావడానికంటే ముందు జరిగిన స్టోరీతో ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి అందుబాటులో ఉంది.
మలయాళం థ్రిల్లర్
ఓటీటీలో మలయాళం సినిమాలకు, అందులోనూ థ్రిల్లర్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కొత్త మలయాళ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిందంటే చాలు ఆడియన్స్ ఎగబడి చూసేస్తారు. ఇప్పుడు మనోరమా మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీల్లో అలాంటి మలయాళ థ్రిల్లర్ ‘ది థర్డ్ మర్డర్’ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చింది.
థ్రిల్ పంచే హిందీ మూవీ
ఇక హిందీ సినిమాల విషయానికి వస్తే.. ఈ వారం టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారిన చిత్రం ‘దయారా’. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో దూసుకెళ్తోంది. దిశా తరహా నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
ఇంగ్లీష్ సూపర్ హీరో క్రేజ్
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ ‘అవెంజర్స్’కు ఉండే ఫ్యాన్ బేస్ వేరు. ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్ కోర్’. ఈ సూపర్ హీరో మూవీ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


