...
...
Next Story

Peddi: రామ్ చరణ్ పెద్ది సినిమాను ఎందుకు చూడాలి? తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన కారణాలు!

Reasons To Watch Ram Charan Peddi Movie: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన పెద్ది సినిమా ఇవాళ (జూన్ 4) భారీ అంచనాల నడుమ విడుదల అయింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా పెద్దిని థియేటర్లలోనే ఎందుకు చూడాలో చెప్పే ముఖ్యమైన 6 కారణాలు తెలుసుకుందాం.

Published on: Jun 4, 2026, 09:41:23 IST
Advertisement

6 Reasons To Watch Ram Charan Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే రోజు రానే వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్' (RRR) తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' ఇవాళ (జూన్ 4, 2026) థియేటర్లలో విడుదల అయింది.

మిస్ కాకూడదని చెప్పే కారణాలు

రామ్ చరణ్ పెద్ది సినిమాను ఎందుకు చూడాలి? తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన కారణాలు!
రామ్ చరణ్ పెద్ది సినిమాను ఎందుకు చూడాలి? తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన కారణాలు!

సుకుమార్ శిష్యుడు, 'ఉప్పెన' (Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసిన పెద్ది సినిమాను థియేటర్లలో అస్సలు మిస్ కాకూడదని చెప్పే ఆరు ముఖ్యమైన కారణాలు ఏంటో చూద్దాం.

1. ఆ 'రంగస్థలం' సెంటిమెంట్.. సుకుమార్ మార్క్!

'పెద్ది' పోస్టర్లు, టీజర్ చూస్తుంటే ప్రతి ఒక్కరికీ రామ్ చరణ్ కెరీర్ బెంచ్ మార్క్ సినిమా 'రంగస్థలం' (Rangasthalam) గుర్తుకురాక మానదు. ఆ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ చేసిన ఊరమాస్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు 'పెద్ది' కూడా అదే విధమైన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, రగ్గడ్, రస్టిక్ థీమ్‌తో వచ్చింది.

దర్శకుడు బుచ్చిబాబు సాన, సుకుమార్ (Sukumar) స్కూల్ నుంచి వచ్చినవాడు కావడమే కాకుండా, రంగస్థలం స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రైటింగ్‌లోనూ భాగస్వామి. పైగా సుకుమార్ ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్. కాబట్టి, మరోసారి రంగస్థలం స్థాయి మ్యాజిక్, ఆ లెవెల్ ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్ పెద్దిలో ఆశించవచ్చు. ఇది పక్కాగా సినిమాను మిస్ కాకూడదనే కారణాల్లో మొదటిది.

2. రామ్ చరణ్ సరికొత్త పవర్ ఫుల్ స్పోర్ట్స్ అవతార్

ఈ పాత్ర కోసం చెర్రీ దాదాపు నాలుగు నెలల పాటు తీవ్రమైన శిక్షణ తీసుకుని, బాడీని పక్కాగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారు. కుస్తీ పోటీల షూటింగ్ సమయంలో ఆయన పలు గాయాలకు కూడా గురయ్యారు. ఒక గ్రామీణ క్రీడాకారుడిగా, తన ప్రజల కోసం క్రీడల ద్వారా రామ్ చరణ్ తేజ చేసే పోరాటం థియేటర్లలో అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

3. కంటతడి పెట్టించే ఎమోషన్.. 50 నిమిషాల షాకింగ్ క్లైమాక్స్!

బయటకు పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌లా కనిపిస్తున్నా, పెద్దిలో లోతైన ఎమోషన్స్ ఉన్నాయని మేకర్స్ గట్టిగా చెప్తున్నారు. ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ స్పందిస్తూ.. "ఈ కథ ప్రతి వయస్సు వారిని టచ్ చేస్తుంది. సినిమా చివరి వరకు బలమైన భావోద్వేగాలు, డ్రామా, స్ఫూర్తిని కలిగి ఉంటుంది" అని పేర్కొన్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఒక అడుగు ముందుకేసి.. "సినిమా చివరి 50 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా, షాకింగ్‌గా, లోతైన ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. ప్రేక్షకులు బరువెక్కిన గుండెతో థియేటర్ల నుంచి బయటకు వస్తారు. అదే సమయంలో వారు ఒక మర్చిపోలేని సినిమా చూశామనే భావన పొందుతారు" అని తెలిపారు. ఈ ఎమోషనల్ రైడ్ కోసమైనా పెద్ది చూడాల్సిందే.

4. జాతీయ స్థాయి స్టార్ కాస్ట్.. జాన్వీ కపూర్ డెబ్యూ క్రేజ్!

జూనియర్ ఎన్టీఆర్ దేవర తర్వాత పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఆమె 'అచ్చియమ్మ' అనే ఎనర్జిటిక్, పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది.

ఇక కీలక పాత్రలలో కన్నడ లెజెండ్ స్టార్ శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) పవర్‌ఫుల్ చీఫ్‌గా, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు (Jagapathi Babu) సీనియర్ విలేజ్ క్యారెక్టర్‌లో, 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ గ్రే క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. వీరితో పాటు బొమన్ ఇరానీ, రవి కిషన్ వంటి ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండటంతో, సినిమా కాస్టింగ్ పరంగా చాలా బలంగా ఉంది.

5. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఊరమాస్ సంగీతం

సాధారణంగా బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం ఇస్తారు. కానీ, పెద్ది కోసం ఏకంగా ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) బరిలోకి దిగారు. విడుదలైన నాలుగు పాటలు - 'చికిరి చికిరి', 'రై రై రా రా', 'హల్లల్లల్లో', 'మస్సా మస్సా' ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.

ముఖ్యంగా రెహమాన్ స్వయంగా పాడిన 'రై రై రా రా' మాస్ డాన్స్ నెంబర్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. జూన్ 4, 2026న రిలీజ్ అయిన ఈ చిత్రానికి రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని సమాచారం.

6. క్యాన్సర్ కారణంగా వదిలేద్దామనుకుని

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ క్యాన్సర్ కారణంగా సినిమాను వదిలేద్దామనుకున్నారు. కానీ, బుచ్చిబాబు మాత్రం గౌర్ నాయుడు పాత్రకు శివన్ననే కావాలని పట్టుబట్టాడు. అందుకోసం శివ రాజ్‌కుమార్ క్యాన్సర్ నుంచి కోలుకుని వచ్చేదాకా ఎదురు చూసి ఆయనతోనే ఆ పాత్రను పండించారు. మరి అలాంటి గౌర్ నాయుడు పాత్రలో శివ రాజ్‌కుమార్ ఎలాంటి ఎమోషన్స్ పండించారు, ఆ పాత్రను ఎలా మలిచారు అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్.

పక్కాగా చూడాల్సిన సినిమాగా

ఇలా రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు సాన భావోద్వేగాల మ్యాజిక్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ సంగీతం - ఇవన్నీ కలిపి రామ్ చరణ్ పెద్ది సినిమాను ఈ వారం పక్కాగా చూడాల్సిన చిత్రంగా మార్చాయని చెప్పవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks