OTT Weekend: ఇవాళ, రేపు వీకెండ్- ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 6 సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!

Top 6 OTT Movies To Watch This Weekend: ఈ శని, ఆదివారాల్లో ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని సరికొత్త వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ఓటీటీ ప్రియుల కోసం క్రేజీ లిస్ట్ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రస్తుతం ట్రెండ్ అవుతూ చూడాల్సిన ది బెస్ట్ 6 ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Jul 4, 2026, 12:16:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Best 6 OTT Movies To Watch This Weekend: వారమంతా పనులతో అలసిపోయిన జనాలకు శని, ఆదివారాలు వస్తే చాలు కాస్త రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. బయట తిరగడం కంటే ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటానికి చాలామంది ఇష్టపడుతుంటారు.

ఇవాళ, రేపు వీకెండ్- ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 6 సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!
ఇవాళ, రేపు వీకెండ్- ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 6 సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!

చూడాల్సిన ది బెస్ట్ 6 ఓటీటీ సినిమాలు

డిజిటల్ మీడియా విప్లవం పెరిగిన తర్వాత ప్రతి వారం ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వీకెండ్‌లో మీ మూడ్‌కు తగ్గట్టుగా యాక్షన్, కామెడీ, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ది బెస్ట్ 6 సినిమాలపై లుక్కేద్దాం.

సూపర్ సుబ్బు (నెట్‌ఫ్లిక్స్):

తెలుగు ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించడానికి వచ్చిన సరికొత్త కామెడీ డ్రామా ఓటీటీ సిరీస్ 'సూపర్ సుబ్బు'. ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సిరీస్ కథ అంతా ఒక పల్లెటూరి చుట్టూ తిరుగుతుంది.

దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సుబ్బు అనే యువకుడి జీవితం, అతను అనుకోకుండా ఆ ఊరిలో సెక్స్ ఎడ్యుకేటర్‌గా మారిన తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే కథ. బోల్డ్ అండ్ ఫన్నీ ఎలిమెంట్స్‌తో ఈ ఓటీటీ సిరీస్ నవ్వులు పూయిస్తోంది.

బాహుబలి ది టార్చ్ బేరర్ (నెట్‌ఫ్లిక్స్):

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన 'బాహుబలి' సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి విజన్‌ను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన డాక్యూసిరీస్ ఇది. 8.9 అత్యుత్తమ ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లో ఉంది. సినిమా నిర్మాణ రంగంలో ఆసక్తి ఉన్నవారితో పాటు, సాధారణ సినిమా అభిమానులు కూడా తప్పక చూడాల్సిన సిరీస్ ఇది.

గ్యారహ్ గ్యారహ్ (జీ5):

సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. రాఘవ్ జుయాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కాలంలో వెనక్కి వెళ్లి, గతంలో మిస్టరీగా మిగిలిపోయిన పాత కేసులను ఎలా ఛేదించాడు అనేది చాలా ఉత్కంఠభరితంగా స్క్రీన్‌ప్లే చేశారు. దీని ఐఎండీబీ రేటింగ్ 8.1. తెలుగులో కూడా గ్యారహ్ గ్యారహ్ ఓటీటీ రిలీజ్ అయింది.

ప్రీతమ్ అండ్ పెడ్రో (జియో హాట్‌స్టార్):

బాలీవుడ్ సీనియర్ నటుడు అర్షద్ వార్సి లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ప్రీతమ్ అండ్ పెడ్రో జూలై 3 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు భిన్నమైన మనస్తత్వాలు, శైలి కలిగిన పోలీస్ ఆఫీసర్లు కలిసి ఒకే కేసును దర్యాప్తు చేయాల్సి వస్తే జరిగే గందరగోళం, హ్యూమర్ ఈ సిరీస్ ప్రత్యేకత. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (జియో హాట్‌స్టార్):

రొమాంటిక్ పొలిటికల్ రివేంజ్ క్రైమ్ డ్రామాగా వచ్చిన సిరీస్ తుక్రా కే మేరా ప్యార్ 2 హాట్‌స్టార్ ఓటీటీ టాప్ 10 లిస్ట్‌లో ట్రెండ్ అవుతోంది. కుల వ్యవస్థ, సామాజిక వివక్ష లాంటి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ సాగే ఈ సిరీస్ సీజన్ 2కు సంబంధించిన 12 ఎపిసోడ్‌లు తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

అవతార్ ఫైర్ అండ్ యాష్ (జియో హాట్‌స్టార్):

గత ఏడాది భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్' సిరీస్ లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ విజువల్స్ హోమ్ థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. తెలుగులోనూ అవతార్ 3 ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More