...
...
Next Story

Farmers: రైతుల మధ్య మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్- రైతుబడిలో ప్రత్యేక స్టాల్- 10 మంది కమెడియన్స్‌తో వినోదంగా!

Mr Work From Home Movie Promotions Between Farmers: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. రైతుల గురించి చెప్పే ఈ సినిమా ప్రమోషన్స్‌ను వారి మధ్య నుంచే ప్రారంభించింది మూవీ టీమ్. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Mar 11, 2026, 10:10:21 IST
Advertisement

ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రమోట్ చేయడం అంతకంటే పెద్ద సవాలుగా మారింది. పెద్ద నిర్మాతలు అయితే భారీ బడ్జెట్‌లతో ప్రమోషన్స్‌ను దుమ్మురేపుతుంటారు. కానీ, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో రూపొందే చిన్న సినిమాల పరిస్థితి మాత్రం అంత సులభం కాదు.

ప్రత్యేకంగా ప్రమోషన్స్

రైతుల మధ్య మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్- రైతుబడిలో ప్రత్యేక స్టాల్- 10 మంది కమెడియన్స్‌తో వినోదంగా!
రైతుల మధ్య మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్- రైతుబడిలో ప్రత్యేక స్టాల్- 10 మంది కమెడియన్స్‌తో వినోదంగా!

అయితే ఇటీవల ఒక సినిమా మాత్రం తన వినూత్నమైన ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, ఈ చిత్రబృందం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

రైతులకు ఉపయోగపడే అంశాన్ని ఈ సినిమాలో చూపించడంతో, సినిమా ప్రమోషన్‌ను కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది.

సినిమాకు ప్రత్యేక స్టాల్

అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కాన్సెప్ట్‌ను వివరించారు. సాధారణంగా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి.

అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది.

రైతుల కోసం చేస్తున్న ప్రయత్నం

ప్రపంచమంతా స్మార్ట్ ఫార్మింగ్ వైపు సాగుతున్న ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక సాంకేతికతలను సంప్రదాయ వ్యవసాయ జ్ఞానంతో కలిపి భవిష్యత్తులో వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందవచ్చో ఈ చిత్రంలో చూపించారు. వ్యవసాయం, సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చిత్రబృందం చెబుతోంది.

సామాజిక వాస్తవాలు, విడాకులు

“మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా నేటి సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే కథతో రూపొందుతోంది. వ్యవసాయంతో పాటు, ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుంది.

మునుపటి తరాలు జంటలకు మార్గనిర్దేశం చేయడంలో, కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తుచేస్తుంది. ఆధునిక స్వాతంత్య్రాన్ని సాంప్రదాయ కుటుంబ విలువలతో ఎలా సమతుల్యం చేయాలనే ప్రశ్నను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుంచుతోంది.

10 మంది కమెడియన్స్‌తో

సందేశాత్మక అంశాలను ప్రస్తావించినప్పటికీ, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది. దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్‌తో ఈ సినిమా నవ్వులు పంచేలా రూపొందించబడింది. యువత, కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాలో హీరోగా త్రిగుణ్, హీరోయిన్‌గా పాయల్ రాధాకృష్ణ చేశారు. అనీష్ కురువిల్లా, శివాజీ రాజా, హర్ష వర్ధన్ కీలక పాత్రలు పోషించారు. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అరవింద్ మండ్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks