Pavitra Punia Defends Mouni Roy Plastic Surgery Trolling: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్‌పై జరుగుతున్న ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్‌పై బుల్లితెర నటి పవిత్ర పునియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వారిపై ఆమె నిప్పులు చెరిగారు.
మౌనీ రాయ్ కనిపించిన తీరుపై

'ది డెవిల్ వేర్స్ ప్రాడా 2' ప్రీమియర్ వేడుకలో మౌనీ రాయ్ కనిపించిన తీరుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, పెదవుల ఆకృతి మార్చుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'స్ల్పిట్స్ విల్లా' ఫేమ్, బుల్లితెర నటి పవిత్ర పునియా ఏప్రిల్ 30న ఒక వీడియో విడుదల చేస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఆ వంటగది మీది కాదు
"నటీనటులను వేధించడం ఆపండి. ఆ వంటగది మీది కాదు, ఆ వంటకం మీది అంతకంటే కాదు. అనవసరమైన మాటల వల్ల మాకేం నష్టం లేదు కానీ, ఇలా వాగితే మీకు వేరేగా జీతం వస్తుందని భ్రమపడుతున్నారేమో" అంటూ పవిత్ర పునియా ఎద్దేవా చేశారు.
మీడియా తీరుపై కూడా అసహనం
కేవలం ట్రోలర్లనే కాకుండా, కొన్ని మీడియా సంస్థల తీరును కూడా పవిత్ర తప్పుబట్టారు. వ్యూస్ కోసం, ఎంగేజ్మెంట్ పెంచుకోవడం కోసం సెలబ్రిటీల ఫోటోలు పెట్టి, అనుమానాస్పదంగా క్యాప్షన్లు ఇస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని పవిత్ర మండిపడ్డారు. "మీడియా కూడా ఇలాంటి విషయాలను ఎంజాయ్ చేస్తోంది. ప్రజలకు ఏదో ఒకటి ఊహించుకునేలా అవకాశమిస్తూ మీ బిజినెస్ చేసుకుంటున్నారు" అని పవిత్ర పునియా విమర్శించారు.
ఆ డబ్బు మీ దగ్గర తీసుకోలేదు!
ప్లాస్టిక్ సర్జరీల గురించి వస్తున్న కామెంట్లకు స్పందిస్తూ పవిత్ర పునియా మరింత ఘాటుగా స్పందించారు. "లక్ష సర్జరీలు చేయించుకున్నారంటూ కొందరు వాగుతున్నారు. ఆ లక్ష రూపాయలు మీ దగ్గర ఏమైనా తీసుకున్నారా? మేము మీ సలహాల కోసం రావడం లేదు. ఇండస్ట్రీలో కొందరు ధైర్యంగా అవును మేము చేయించుకున్నాం అని చెబుతున్నారు. మీకు కూడా అంతగా కావాలంటే, మీ కుటుంబ సభ్యులకు చేయించాలనుకుంటే మీ డబ్బు ఖర్చు పెట్టుకుని చేయించుకోండి. కానీ ఇతరులను ట్రోల్ చేయడం ఆపి, నోరు మూసుకోండి" అని పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవిత్ర పునియా మద్దతుగా నిలవడంతో
{{/usCountry}}ప్లాస్టిక్ సర్జరీల గురించి వస్తున్న కామెంట్లకు స్పందిస్తూ పవిత్ర పునియా మరింత ఘాటుగా స్పందించారు. "లక్ష సర్జరీలు చేయించుకున్నారంటూ కొందరు వాగుతున్నారు. ఆ లక్ష రూపాయలు మీ దగ్గర ఏమైనా తీసుకున్నారా? మేము మీ సలహాల కోసం రావడం లేదు. ఇండస్ట్రీలో కొందరు ధైర్యంగా అవును మేము చేయించుకున్నాం అని చెబుతున్నారు. మీకు కూడా అంతగా కావాలంటే, మీ కుటుంబ సభ్యులకు చేయించాలనుకుంటే మీ డబ్బు ఖర్చు పెట్టుకుని చేయించుకోండి. కానీ ఇతరులను ట్రోల్ చేయడం ఆపి, నోరు మూసుకోండి" అని పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవిత్ర పునియా మద్దతుగా నిలవడంతో
{{/usCountry}}గతంలో కూడా మౌనీ రాయ్ తన పెదవులకు సర్జరీ చేయించుకుందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా పవిత్ర పునియా మద్దతుగా నిలవడంతో ఈ అంశం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కాగా బుల్లితెర సీరియల్‌లో హీరోయిన్‌గా చేసిన మౌనీ రాయ్ బాలీవుడ్ వెండితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. మౌనీ రాయ్‌పై ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి?
ఇటీవల ఒక సినిమా ప్రీమియర్ వేడుకలో ఆమె లుక్ మారినట్లు అనిపించడంతో, నెటిజన్లు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు.
2. పవిత్ర పునియా ట్రోలర్లకు ఏమని సమాధానం ఇచ్చారు?
సెలబ్రిటీలు సర్జరీల కోసం ఎవరి దగ్గరా డబ్బులు అడగరని, వారి వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని పవిత్ర గట్టిగా చెప్పారు.
3. పవిత్ర పునియా మీడియాను ఎందుకు విమర్శించారు?
సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి సెలబ్రిటీల ఫోటోలపై తప్పుదోవ పట్టించేలా క్యాప్షన్లు ఇస్తున్నారని ఆమె మీడియాపై మండిపడ్డారు.
4. పవిత్ర పునియా ఏ షో ద్వారా గుర్తింపు పొందారు?
ఆమె ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా 3 (MTV Splitsvilla 3) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.