Upasana Konidela Peddi Review: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం 'పెద్ది' మేనియా నడుస్తోంది. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూన్వీ కపూర్ జంటగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలోకి వచ్చేసింది.
చీర్ లీడర్‌గా ఉపాసన

అయితే, ఒక రోజు ముందుగానే అంటే జూన్ 3న రాత్రి నిర్వహించిన పెద్ది ప్రీమియర్ షోలకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే, రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల తన భర్త సినిమాకు అతిపెద్ద చీర్ లీడర్‌గా మారిపోయారు.
అభిమానులతో కలిసి థియేటర్లో సందడి
థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని ఉపాసన కొణిదెల చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉపాసన కొణిదెల కేవలం సినిమా చూడటమే కాదు, మెగా అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పెద్ది సినిమాను వీక్షించారు.
వీడియోలు వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఉపాసన అభిమానులతో మమేకమై సినిమాను ఆస్వాదించారు. రామ్ చరణ్ స్క్రీన్‌పై కనిపించిన కీలక సన్నివేశాలలో అభిమానులు ఈలలు, గోలలు చేస్తుంటే, ఉపాసన కూడా వారితో కలిసి కేరింతలు కొట్టారు. ఫ్యాన్స్‌తో కలిసి అరుపులతో గోల చేశారు.
ముఖ్యంగా, థియేటర్ నేలపై పడి ఉన్న పేపర్ ముక్కలను చేతిలోకి తీసుకుని, అభిమానుల తరహాలో గాల్లోకి చల్లుతూ ఉపాసన కొణిదెల సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది. మెగా కోడలు ఇంత మాస్‌గా ఎంజాయ్ చేయడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
'అమేజింగ్'.. ఉపాసన వన్-వర్డ్ రివ్యూ
పెద్ది సినిమా ముగిసిన తర్వాత థియేటర్ బయటకు వస్తున్న ఉపాసనను మీడియా ప్రతినిధులు, అభిమానులు చుట్టుముట్టారు. భారీ భద్రత నడుమ ఆమె కారు వైపు వెళ్తుండగా, సినిమా ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది. దానికి ఉపాసన ఎక్కువ మాటలు చెప్పకుండా, కేవలం ఒకే ఒక్క మాటలో రివ్యూ ఇచ్చారు.
{{/usCountry}}పెద్ది సినిమా ముగిసిన తర్వాత థియేటర్ బయటకు వస్తున్న ఉపాసనను మీడియా ప్రతినిధులు, అభిమానులు చుట్టుముట్టారు. భారీ భద్రత నడుమ ఆమె కారు వైపు వెళ్తుండగా, సినిమా ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది. దానికి ఉపాసన ఎక్కువ మాటలు చెప్పకుండా, కేవలం ఒకే ఒక్క మాటలో రివ్యూ ఇచ్చారు.
{{/usCountry}}"అమేజింగ్," అని ఉపాసన కొణిదెల చిరునవ్వుతో పెద్ది మూవీపై వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. రామ్ చరణ్ సతీమణి నోట ఈ మాట రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
'పెద్ది' గురించి కొన్ని విశేషాలు..
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సాన తెరకెక్కించిన రెండో చిత్రం ఇది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి వివిధ క్రీడలలో కనిపిస్తారు. ఒక వ్యక్తి తన మూలాలను, గుర్తింపును క్రీడల ద్వారా ఎలా వెతుక్కున్నాడనేది ఈ సినిమా కథాంశం.
ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
పెద్ది రివ్యూల ప్రకారం
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. పెద్ది రివ్యూ ప్రకారం.. ఈ సినిమా గుర్తింపు గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తిందని, స్పోర్ట్స్ విభాగంలో క్రికెట్, కుస్తీ సీన్స్ చాలా బలంగా ఉన్నాయని సమాచారం.
అయితే, జాన్వీ కపూర్ పాత్ర కాస్త బలహీనంగా ఉందని, కొన్ని రొటీన్ మాస్ సీన్స్ ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా బుచ్చిబాబు, రామ్ చరణ్ ఖాతాలో ఇది మరో విజయంగా నిలుస్తుందని టాక్ వస్తోంది.