...
...
Next Story

Ustaad bhagat singh: ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ డేట్-ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా? డీల్ ధర ఇదే-అదిరిన కొత్త పోస్టర్

Ustaad bhagat singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. వచ్చే నెలలో థియేటర్లకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రీమియర్ డేట్, ఓటీటీ డీల్ పై ఓ లుక్కేయండి.

Published on: Feb 28, 2026, 21:48:20 IST
Advertisement

ఓజీ సినిమాతో పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఈ మూవీ పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు అదే ఊపుతో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మరోసారి బాక్సాఫీస్ వేటకు పవన్ రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పోస్టర్ లో పవన్ కల్యాణ్, శ్రీలీల (x/PrathyangiraUS)
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పోస్టర్ లో పవన్ కల్యాణ్, శ్రీలీల (x/PrathyangiraUS)

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రత్యాంగిరా సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ ను పంచుకుంది. ఇందులో గన్ పట్టుకున్న పవన్ కల్యాణ్ వైపు అందాల భామ శ్రీలీల ప్రేమగా చూస్తూ ఉంది. నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీమియర్ మార్చి 25, 2026న ఉండబోతుందని కూడా ప్రత్యాంగిరా సినిమాస్ ప్రకటించింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26, 2026న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజైన దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటలు తెగ వైరల్ గా మారాయి.

ఆ బ్లాక్ బస్టర్ తర్వాత

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, నవాబ్ షా, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర తదితరులు కూడా నటించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి కుమార్ నిర్మించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks