...
...
Next Story

UBS Twitter Review: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విటర్ రివ్యూ- ఇంటర్వెల్ అలా, తక్కువ అంచనా వేశామంటూ హరీష్‌కు సారీ!

Pawan Kalyan Ustaad Bhagat Singh Twitter Review In Telugu: పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మరోసారి వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్సుగా నటించిన ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. మరి ఈ సినిమాపై టాక్ ఎలా ఉందో ఉస్తాద్ భగత్ సింగ్ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Mar 19, 2026, 08:59:04 IST
Advertisement

UBS Twitter Review: పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

విలన్‌గా డైరెక్టర్

పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విటర్ రివ్యూ- ఇంటర్వెల్ అలా, తక్కువ అంచనా వేశామంటూ హరీష్‌కు సారీ!
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విటర్ రివ్యూ- ఇంటర్వెల్ అలా, తక్కువ అంచనా వేశామంటూ హరీష్‌కు సారీ!

ఈ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలతోపాటు బ్యూటిపుల్ రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా చేశారు. తమిళ అగ్ర నటుడు, డైరెక్టర్ పార్థిబన్ విలన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే, బీజీఎమ్ మాత్రం ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు.

ఉగాది సందర్భంగా రిలీజ్

పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మరోసారి వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇవాళ అంటే మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ట్విటర్ రివ్యూ

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 4 నుంచే బెనిఫిట్ షోలు పడ్డాయి. తెలంగాణలో మాత్రం 7 గంటల నుంచి షోస్ రన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్‌ చూసిన నెటిజన్స్, ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇస్తున్నారు. మరి ఈ మూవీపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఉస్తాద్ భగత్ సింగ్ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

గూస్‌బంప్ స్టఫ్ అసలు

"ఆఖరికి ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ కొట్టేశాం బాబాయ్ పవన్ కల్యాణ్. హరీష్ శంకర్ థ్యాంక్యూ స్వామీ. మళ్లీ మా బాబాయ్‌ను ఇలా చూస్తా అనుకోలే.." అంటూ రామ్ చరణ్ వీడియో క్లిప్‌ను పంచుకున్నాడు ఓ అభిమాని.

"అమ్మతోడు చచ్చిపోతారు. అసలు కల్యాణ్‌ని ఇలా చూస్తాను అనుకోలేదు. పవన్ కల్యాణ్ అభిమానిగా డిమాండ్ చేస్తున్నా ఆయన అన్ని సినిమాలకు హరీష్ శంకర్‌ను పర్మినెంట్ డైరెక్టర్‌గా, తమన్ అన్న మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ కల్యాణ్ లవ్ యూ లవ్ యూ" అంటూ మరొకరు రాసుకొచ్చారు.

"ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశాను. బ్లాక్ బస్టర్ మూవీ. పవన్ కల్యాణ్ టాప్ క్లాస్ మోడ్‌లో ఉన్నారు. ఆరా, స్వాగ్, ఎనర్జీ ఫుల్‌గా నిండిపోయింది. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ అదిరిపోయింది. కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ, తమన్ ఎలక్ట్రిఫైయింగ్ బీజీఎమ్, హరీష్ శంకర్ క్యాచీ డైలాగ్స్ ప్రధాన ప్లస్‌లు. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్. కచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇచ్చి పడేసే సినిమా ఇది.. బాక్సాఫీస్ ఇరగదీస్తుంది" అని ఒకరు రివ్యూ ఇచ్చారు.

"పవన్ కల్యాణ్ చైల్డ్ హుడ్ పోర్షన్స్ చాలా బాగా రాసుకున్నారు. పవన్ కల్యాణ్ ఎంట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫస్టాఫ్ చాలా బాగా సాగింది. సారీ హరీష్ (శంకర్ డైరెక్టర్) తక్కువ అంచనా వేసినందుకు" అని ఒకరి చెప్పుకొచ్చారు.

పాజిటివ్ టాక్

ఇలా దాదాపుగా ఉస్తాద్ భగత్ సింగ్‌పై చాలా పాజిటివ్ టాక్ వస్తోంది. హరీష్ శంకర్‌ను తక్కువ అంచనా వేసిన ఫ్యాన్స్ కూడా సారీ చెబుతున్నారు. అలాగే, ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్ అదిరిపోయిందని, బీజీఎమ్, డైలాగ్స్ సూపర్బ్ అంటూ పొగుడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe