Vamsi Paidipally About Salman Khan Over Maatrubhumi Trailer Release: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భారత ఆర్మీ అధికారిగా నటిస్తున్న భారీ చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన మాతృభూమి ట్రైలర్‌ను మంగళవారం (నవంబర్ 10) సాయంత్రం సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
రేపు చేసే పని నేడే చేయి

"రేపు చేసే పని నేడే చేయి.. నేడు చేసే పని ఇప్పుడే చేయి" అంటూ సరదా క్యాప్షన్ జోడించి అభిమానులతో ట్రైలర్‌ను పంచుకున్నారు. ముంబైలో కొద్దిరోజుల క్రితం జరిగిన లాంచ్ ఈవెంట్ తర్వాత అధికారికంగా డిజిటల్ మీడియాలో విడుదలైన ఈ మాతృభూమి ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సల్మాన్ శ్రమ నాకు తెలుసు: వంశీ పైడిపల్లి
సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్‌పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకట్టుకుంది. సల్మాన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ పడిన శ్రమను కొనియాడారు.
"ఈ సినిమా కోసం మీరు చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న ఒత్తిడి నాకు వ్యక్తిగతంగా తెలుసు సర్. మీ పట్టుదల, సినిమా పట్ల ఉన్న నిబద్ధత ప్రతీ దృశ్యంలోనూ కనిపిస్తున్నాయి. మీకు దక్కాల్సిన విజయం, ప్రశాంతత లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని వంశీ పైడిపల్లి పేర్కొన్నారు.
దర్శకుడు అపూర్వ లఖియా, కథానాయిక చిత్రాంగదా సింగ్ సహా చిత్ర బృందానికి వంశీ పైడిపల్లి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 'SVC63'లో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ కలయిక కారణంగానే సల్మాన్ 'మాతృభూమి' చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.
'గల్వాన్' నుంచి 'మాతృభూమి' వరకు..
ఇదిలా ఉంటే మాతృభూమి చిత్రం వెనుక ఒక ఆసక్తికర నేపథ్యం ఉంది. మొదట్లో ఈ చిత్రాన్ని 2020-21 నాటి భారత్-చైనా సరిహద్దు ఘర్షణల ఆధారంగా 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరుతో రూపొందించాలనుకున్నారు.
{{/usCountry}}ఇదిలా ఉంటే మాతృభూమి చిత్రం వెనుక ఒక ఆసక్తికర నేపథ్యం ఉంది. మొదట్లో ఈ చిత్రాన్ని 2020-21 నాటి భారత్-చైనా సరిహద్దు ఘర్షణల ఆధారంగా 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరుతో రూపొందించాలనుకున్నారు.
{{/usCountry}}గల్వాన్ లోయ పోరాటంలో వీరమరణం పొందిన తెలంగాణ సూర్యపేటకు చెందిన కల్నల్ బి.సంతోష్ బాబు పాత్ర ఆధారంగా సల్మాన్ నటిస్తున్నారని ప్రచారం సాగింది. గతేడాదే షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే కొన్ని కారణాల వల్ల స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, టైటిల్‌ను 'మాతృభూమి'గా మారుస్తూ రీషూట్ చేశారు.
వివాదాలపై సల్మాన్ ఖాన్ స్పష్టత
స్క్రిప్ట్ మార్పులు, చైనా వ్యతిరేక ప్రచారంపై వస్తున్న కథనాలపై ముంబై ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ స్పందించారు. "మేము చైనాకు వ్యతిరేకంగా సినిమా తీశామని లేదా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి స్క్రిప్ట్ మార్పించిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే" అని సల్మాన్ ఖాన్ తేల్చిచెప్పారు.
"సరిహద్దుల్లో పోరాడే సైనికులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితులను ఈ సినిమాలో చూపించాం. దేశ రక్షణే ధ్యేయంగా జీవించే సైనికుల త్యాగాలకు ఈ చిత్రం ఒక నిదర్శనం. ప్రతికూల వాతావరణంలో సైతం మన సరిహద్దులను ఎలా కాపాడుకుంటారో కళ్లకు కట్టినట్లు చూపించాం" అని ఆయన వివరించారు.
డిసెంబర్ 4న మాతృభూమి విడుదల
చిత్రాంగదా సింగ్, అనూప్ విక్రమ్ షాహి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. సైనిక దుస్తుల్లో సల్మాన్ ఖాన్ లుక్ మెప్పిస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.