OTT Thriller: డిఫరెంట్ జోనర్ సినిమాలు, సిరీస్ లతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న పాపులర్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ మరో కొత్త సిరీస్ ను తీసుకొస్తుంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కిన ‘వరం’ ఓటీటీ స్ట్రీమింగ్ ను జియోహాట్‌స్టార్ ప్రకటించేసింది.
వరం ఓటీటీ

సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రెడీ అయిన వరం వెబ్ సిరీస్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 9 నెలల క్రితమే ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. అప్పుడే కమింగ్ సూన్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని రోజులకు స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు.
థ్రిల్లర్ సిరీస్
వరం సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఇదే నెలలో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 22 నుంచి ఈ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని జియోహాట్‌స్టార్ ఇవాళ (అక్టోబర్ 1) అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా క్రేజీ అనౌన్స్ మెంట్ వీడియోనూ రిలీజ్ చేసింది.
స్టోరీ ఏంటంటే?
ఒక నిరుపేద బస్తీలో రాజు అనే కుర్రాడు ఉంటాడు. అతను పబ్లిక్ టాయిలెట్ లో పని చేస్తుంటాడు. అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయిని రాష్ట్ర మంత్రి తన సొంతం చేసుకోవాలనుకుంటాడు.
ఓ వైపు పేదరికం, మరోవైపు ప్రేమించిన అమ్మాయి.. ఈ నేపథ్యంలోనే రాజుకు ఓ అద్భుతమైన వరం లభిస్తుంది. రేపు జరగబోయే భవిష్యత్తును ఈరోజే తెలుసుకోగలిగే శక్తి అతనికి వస్తుంది. ఈ వరంతో కథ మలుపు తిరుగుతుంది.
మరి ఈ రహస్య విద్యతో అతను తన పేదరికం నుంచి బయటపడి, జీవితంలో ఎలా స్థిరపడ్డాడు? అయితే, భవిష్యత్తును ముందుగానే మార్చడానికి ప్రయత్నించినప్పుడు అతను ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ తెలుగు ఫాంటసీ క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు.
రాజశేఖర్ కూతురు
{{/usCountry}}మరి ఈ రహస్య విద్యతో అతను తన పేదరికం నుంచి బయటపడి, జీవితంలో ఎలా స్థిరపడ్డాడు? అయితే, భవిష్యత్తును ముందుగానే మార్చడానికి ప్రయత్నించినప్పుడు అతను ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ తెలుగు ఫాంటసీ క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు.
రాజశేఖర్ కూతురు
{{/usCountry}}ఈ వరం వెబ్ సిరీస్ లో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటించాడు. అతని సరసన సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అంతేకాకుండా శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్ వినీత్, జైయేత్రి, శ్రుతి జయన్ తదితరులు నటించారు.
ప్రొడ్యూసర్ గా మెగా డాటర్
ఈ వెబ్ సిరీస్ ను చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మించారు. మెగా డాటర్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సిరీస్ పై హైప్ ఏర్పడింది. ఈ సిరీస్ కు ఆదిత్య మండాల డైరెక్టర్. మరి ఇదే నెలలో ఓటీటీలోకి రాబోతున్న వరం వెబ్ సిరీస్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.