తెలుగులో మల్టీ స్టార్స్ సినిమాలకు పెట్టింది పేరుగా హీరో దగ్గుబాటి వెంకటేష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వెంకటేష్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా చేసింది.
సంక్రాంతి కానుకగా రిలీజ్

సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దగ్గుబాటి వెంకటేష్.
ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ఇది మామూలుగా లేదు. ఆయన రఫ్ ఆడేస్తారు. నేను కూడా ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అని రఫ్ ఆడాను. ఇద్దరం రాఫ్ఫాడాం. రచ్చ రచ్చే" అని అన్నారు.
ఇదే సంక్రాంతి స్పిరిట్
"నేను మా తమ్ముళ్లు పవన్ కల్యాణ్‌తో మహేశ్ బాబుతో మల్టీ స్టార్స్ చేశాను. ఇప్పుడు అన్నయ్య (చిరంజీవి)తో చేస్తున్నాను. సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్. అనిల్‌తో నాది వండర్‌ఫుల్ కాంబినేషన్. అన్ని సినిమాలు మీరు సూపర్ హిట్ చేశారు. తన రైటింగ్ టీం. టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని వెంకటేష్ తెలిపారు.
సంక్రాంతి సినిమాలు అన్నీ
"మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. ఎప్పటిలాగే మీరు దాన్ని అద్భుతంగా ఆదరించి మంచి హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి ఫిలిమ్స్ అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని హీరో వెంకటేష్ ఆకాంక్షించారు.
తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే
{{/usCountry}}"మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. ఎప్పటిలాగే మీరు దాన్ని అద్భుతంగా ఆదరించి మంచి హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి ఫిలిమ్స్ అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని హీరో వెంకటేష్ ఆకాంక్షించారు.
తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే
{{/usCountry}}"తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు ఆడాలి. మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్" అని వెంకటేష్ తన స్పీచ్ ముగించారు.
ఏఎస్ ప్రకాష్ కామెంట్స్
ఇదే ఈవెంట్‌లో ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ.. "మెగాస్టార్ చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.
చక్కని పాట రాయించుకున్నారు
లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకు పాటలు రాయడం ఎప్పుడూ ఆనందకరమైన విషయం. ఈ సినిమాలో కూడా చక్కని పాట రాయించుకున్నారు. నా పాట ఈ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఆ పాట చూడ్డానికి నేను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా సంక్రాంతికి గొప్ప విజయాన్ని నమోదు చేయబోతోంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.