Aadarsha Kutumbam: వెంకటేష్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా జరిగిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన తన సినిమా విజయంపై ఉన్న నమ్మకాన్ని క్రికెట్ భాషలో చెప్పారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యాయని అన్నారు.
వెంకటేష్ కామెంట్స్

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. అక్టోబర్ 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (అక్టోబర్ 27) రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో వెంకటేష్ స్పీచ్ వైరల్ గా మారింది.
"ఈ మధ్య మన టీమిండియా కుర్రాళ్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ గ్రౌండ్ లోకి దిగితే సిక్సర్లు, ఫోర్లతో ఎలా మోత మోగిస్తున్నారో.. థియేటర్లలో మా 'ఆదర్శ కుటుంబం' కూడా అలాగే సిక్సర్లు, సెంచరీలు కొడుతుంది" అని వెంకటేష్ చేసిన కామెంట్స్ కు ఫ్యాన్స్ నుంచి విజిల్స్ దద్దరిల్లాయి.
బాక్సాఫీస్ వద్ద సెంచరీ పక్కా!
ఆదర్శ కుటుంబం సినిమా అవుట్ పుట్ పట్ల చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ డ్రామా, క్లీన్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయమని మేకర్స్ నమ్ముతున్నారు.
టీమిండియా బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి సెంచరీలు సాధిస్తున్నట్లే, ఈ సినిమా కూడా ఎలాంటి పోటీ లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద ఈజీగా వంద కోట్ల క్లబ్ (సెంచరీ) చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఏపీలో తుపాను ఎఫెక్ట్
{{/usCountry}}టీమిండియా బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి సెంచరీలు సాధిస్తున్నట్లే, ఈ సినిమా కూడా ఎలాంటి పోటీ లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద ఈజీగా వంద కోట్ల క్లబ్ (సెంచరీ) చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఏపీలో తుపాను ఎఫెక్ట్
{{/usCountry}}అయితే ఆదర్శ కుటుంబం సినిమా యూనిట్ కు ఒక ఊహించని షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 30న 'ఆదర్శ కుటుంబం' భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ, సరిగ్గా ఇదే సమయానికి ఆంధ్రప్రదేశ్ లో తుపాను ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే అర్నబ్ తుపాను ప్రభావం మొదలైంది. కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉండటంతో.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఓపెనింగ్స్ కు షాక్ తప్పదా?
సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ వర్షాలు, తుపానుల సమయంలో బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించరు. మరోవైపు మొదటి మూడు రోజులు ఆదర్శ కుటుంబం సినిమాకు అత్యంత కీలకం. ఒకవేళ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటే, ఏపీలో సినిమా ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
మరి వెంకీ మామ చెప్పినట్లు కంటెంట్ లో స్టఫ్ ఉంటే.. తుపానును సైతం లెక్కచేయకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సిక్సర్లు కొడుతుందా? లేదా వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలో వసూళ్లకు బ్రేకులు పడతాయా? అనేది అక్టోబర్ 30న తేలిపోనుంది.