Vijay Deverakonda Rashmika Mandanna Japan Vacation Photos: టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు. ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్ వేదికగా ఎంతో వైభవంగా పెళ్లి పీటలెక్కిన ఈ జంట, ఇటీవల 'కాఫీ విత్ కరణ్' ఓటీటీ షోలో పాల్గొని విమర్శల పాలైంది.

అయితే ఆ వివాదాలన్నింటికీ తెరదించుతూ విజయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జపాన్ పర్యటనకు సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకున్నారు. తద్వారా తమ బంధంపై వస్తున్న పుకార్లకు, ట్రోలింగ్‌కు తనదైన శైలిలో చెక్ పెట్టారు.
'నా సొంతం.. నా ఇల్లు': రష్మికపై విజయ్ ప్రేమ వర్షం
వివాదాల వేడి తగ్గిన కొద్ది రోజులకే విజయ్ తన తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండ, సతీమణి రష్మికతో కలిసి జపాన్ విహారయాత్రకు వెళ్లారు విజయ్ దేవరకొండ. అక్కడ కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా గడుపుతున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఒక ఫోటోలో కుటుంబమంతా కలిసి కలరింగ్ వేస్తూ కనిపించగా.. "ఫ్యామిలీ కలరింగ్ టైమ్.. మధ్యలో కాఫీ, మాచా బ్రేక్స్" అని విజయ్ సరదాగా రాసుకొచ్చారు.
ఈ పోస్ట్‌లో విజయ్, రష్మికల రొమాంటిక్ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రష్మికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని దిగిన ఫోటోకు "నా సొంతం (Mine)" అని విజయ్ క్యాప్షన్ ఇచ్చారు. మరో ఫోటోలో రష్మిక చిరునవ్వులు చిందిస్తుండగా, ఆమె భుజంపై విజయ్ తన తలను వాల్చి ఎంతో ప్రశాంతంగా కనిపించారు.
దానికి "ఇల్లు (Home)" అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జతచేశారు. మరో ఫొటో మధ్యలో మైసా తరహాలో రష్మిక కత్తి పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
గతేడాది అక్టోబర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న విజయ్, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లికి కొద్ది రోజుల ముందు తమ వివాహ వార్తను అధికారికంగా ప్రకటించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి తొలిసారి 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో సందడి చేశారు. తమ ప్రేమ, పెళ్లి విశేషాలను అభిమానులతో పంచుకునే క్రమంలో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.
{{/usCountry}}గతేడాది అక్టోబర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న విజయ్, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లికి కొద్ది రోజుల ముందు తమ వివాహ వార్తను అధికారికంగా ప్రకటించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి తొలిసారి 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో సందడి చేశారు. తమ ప్రేమ, పెళ్లి విశేషాలను అభిమానులతో పంచుకునే క్రమంలో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.
{{/usCountry}}పెళ్లికి అంగీకరించే ముందు ఏడాది కాలంలో రష్మిక తనకు వందసార్లు ప్రపోజ్ చేసిందని విజయ్ ఆ షోలో సరదాగా వ్యాఖ్యానించారు. ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లోనే తాను మోకాళ్లపై కూర్చుని ఆమెకు ఉంగరం తొడిగానని చెబుతూ ఆ రింగ్‌ను చూపించారు.
గతంలో రష్మిక వేలికి ఉన్న మరో ఉంగరాన్ని చూసి అదే ఎంగేజ్‌మెంట్ రింగ్ అని చాలామంది భావించారని, అది తన స్టైల్ కాదని చెప్పడం తనకు అవమానంగా అనిపించిందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. రష్మిక పట్ల విజయ్ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.. ఆపై 'రణబాలి' సందడి
విమర్శలు హద్దుమీరడంతో ఈ జంట ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అంతటితో ఆగకుండా, తమపై సోషల్ మీడియాలో తప్పుడు, అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరి బృందం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
సినిమాల విషయానికి వస్తే, పెళ్లి తర్వాత విజయ్, రష్మిక మందన్నా కలిసి నటించిన తొలి చిత్రం 'రణబాలి' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ పీరియాడిక్ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పించింది.
కరువు నేపథ్యంలో
19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో తలెత్తిన కరువు నేపథ్యంలో సాగే రణబాలి కథలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడిగా నటించారు. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఓటీటీలో రణబాలి
నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. వ్యక్తిగత విమర్శలు, బాక్సాఫీస్ ఫలితాలను పక్కనపెట్టి విజయ్-రష్మిక జంట జపాన్ విహారయాత్రతో కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటోంది.