...
...
Next Story

Ranabaali: దసరా రేసులో విజయ్-రష్మిక ‘రణబాలి’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. రజినీ, చిరు, ధనుష్‌లతో బాక్సాఫీస్ వార్!

Ranabaali Release Date: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ ప్రకటించారు. 2026 దసరా రేసులో రణబాలి అడుగుపెట్టనుంది. రజినీకాంత్, చిరంజీవి, ధనుష్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

Published on: Aug 27, 2026, 11:27:19 IST
Advertisement

Ranabaali Release Date: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali). ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఫస్ట్ ప్రకటించారు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

రణబాలి రిలీజ్ డేట్

దసరా బరిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ..రణబాలి రిలీజ్ పోస్ట్ పోన్..కొత్త డేట్ ఇదే..చిరంజీవి, ధనుష్ సినిమాలతో ఢీ! (x/MythriOfficial)
దసరా బరిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ..రణబాలి రిలీజ్ పోస్ట్ పోన్..కొత్త డేట్ ఇదే..చిరంజీవి, ధనుష్ సినిమాలతో ఢీ! (x/MythriOfficial)

పెళ్లి అయిన తర్వాత విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఫస్ట్ సినిమా ‘రణబాలి’. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇవాళ (ఆగస్టు 27) ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2026 అక్టోబర్ 16న దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

పోస్టర్ వైరల్

"మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో మొదలుకానుంది" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన రణబాలి పోస్టర్ నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

హ్యాట్రిక్ కాంబినేషన్

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరాలు సమకూరుస్తుండగా, నిరవ్ షా ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

దసరా బాక్సాఫీస్ వార్

ఈసారి దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ వద్ద అదిరే వార్ కు వేదిక కాబోతోంది. రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' చిత్రం అక్టోబర్ 15న విడుదల కానుండగా, మరుసటి రోజు అంటే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ 'రణబాలి'తో పాటు ధనుష్ నటించిన పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఓమ్ పార్ట్ 1' (Om Part 1) కూడా పోటీలో నిలిచింది.

దీనికితోడు మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' కూడా దసరా రేసులోనే ఉండటంతో ఈ సారి పండుగకు థియేటర్ల వద్ద ఊహించని రీతిలో భారీ బాక్సాఫీస్ వార్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

పోరులో గెలిచేనా?

చారిత్రాత్మక నేపథ్యంలో ఉత్కంఠభరిత కథాంశంతో రూపుదిద్దుకుంటున్న 'రణబాలి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలని సినీ ప్రియులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దసరా పోరులో మూవీ గెలుస్తుందా అనే ఇంట్రెస్ట్ కలుగుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe