...
...
Next Story

Maharaja: తమిళ సినిమా సరికొత్త చరిత్ర.. హాలీవుడ్‌లో రీమేక్ కానున్న విజయ్ సేతుపతి ‘మహారాజ’.. ఈ ఓటీటీలో చూసేయండి

Maharaja: విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ మూవీ హిస్టరీ క్రియేట్ చేసింది. హాలీవుడ్ లో రీమేక్ కానున్న ఫస్ట్ తమిళ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తమిళ సినిమాకే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీకే ఇది గర్వకారణం. ఈ మూవీ ఓటీటీ వివరాలు కూడా చూసేయండి.

Published on: Sep 16, 2026, 13:53:10 IST
Advertisement

Maharaja: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమిళ చిత్రం 'మహారాజ' (Maharaja) హిస్టరీక్రియేట్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ ప్యాషన్ స్టూడియోస్ (Passion Studios) అధికారికంగా ప్రకటించింది.

ఆస్కార్ విన్నర్

తమిళ సినిమా సరికొత్త చరిత్ర-హాలీవుడ్‌లో రీమేక్ కానున్న విజయ్ సేతుపతి 'మహారాజ'! మెయిన్ లీడ్ లో ఆస్కార్ విన్నర్! (x/PassionStudios_)
తమిళ సినిమా సరికొత్త చరిత్ర-హాలీవుడ్‌లో రీమేక్ కానున్న విజయ్ సేతుపతి 'మహారాజ'! మెయిన్ లీడ్ లో ఆస్కార్ విన్నర్! (x/PassionStudios_)

మహారాజ మూవీ సంచలనం క్రియేట్ చేసింది. హాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న ఫస్ట్ తమిళ మూవీగా నిలిచింది. అంతేకాకుండా 'ఇంటర్‌స్టెల్లార్' ఫేమ్, ఆస్కార్ విన్నర్ మాథ్యూ మెక్‌నఘే (Matthew McConaughey) విజయ్ సేతుపతి పోషించిన ప్రధాన పాత్రలో నటించనున్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో తుఫాను రేపుతున్నాయి.

హాలీవుడ్‌కి మహారాజ

నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన 'మహారాజ' కేవలం తమిళనాటనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఈ చిత్రం హాలీవుడ్ వెండితెరపై రీమేక్ కాబోతుండటం భారతీయ చలనచిత్ర రంగానికి దక్కిన గొప్ప గౌరవమని చెప్పొచ్చు. ఒక ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ స్టూడియో భాగస్వామ్యంతో ప్యాషన్ స్టూడియోస్ ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ హాలీవుడ్ వెర్షన్‌లో ప్రధాన పాత్ర కోసం హాలీవుడ్ అగ్ర నటుడు మాథ్యూ మెక్‌నఘేతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 'ఇంటర్‌స్టెల్లార్', 'డల్లాస్ బాయర్స్ క్లబ్' వంటి ఆస్కార్ స్థాయి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాథ్యూ.. విజయ్ సేతుపతి పోషించిన ఎమోషనల్ అండ్ రివేంజ్ పాత్రలో నటించనుండటం సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ రీమేక్‌కు సంబంధించి దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

అక్కడి సినిమాలు ఇక్కడ

మాథ్యూ మెక్‌నఘే లాంటి పవర్‌హౌస్ యాక్టర్ ఈ పాత్రను ఎంచుకోవడం వెనుక ఉన్న ముఖ్య కారణం అందులోని ఎమోషనల్ డెప్త్. 'ట్రూ డిటెక్టివ్' సిరీస్‌లో మాథ్యూ కనబరిచిన నటనను గమనిస్తే, 'మహారాజ'లోని సామాన్య తండ్రి ప్రతీకార ప్రయాణానికి ఆయన నూటికి నూరు శాతం సరిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ఓటీటీలో

బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసిన మహారాజ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతూనే ఉంది. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో అందుబాటులో ఉంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks