...
...
Next Story

Virat Anushka: విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్.. స్టేడియంలో అనుష్క శర్మ రియాక్షన్ వైరల్.. ఆర్సీబీ ఓనర్ అనన్య బిర్లా ఇలా

Virat Anushka: ఐపీఎల్ 2026 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీళ్ల వీడియోలే ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ గా మారాయి.

Published on: Mar 29, 2026, 08:03:47 IST
Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శుభారంభం చేసింది. ఫస్ట్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ కెమిస్ట్రీనే హైలైట్ గా మారింది.

కోహ్లి ఫ్లయింగ్ కిస్

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ (x)
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ (x)

సన్‌రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అదరగొట్టాడు. అజేయ హాఫ్ సెంచరీతో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసి తర్వాత స్టాండ్స్ లో ఉన్న అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ పంపించాడు విరాట్. అనుష్క కూడా అలాగే రియాక్టయింది.

వీడియోలు వైరల్

ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్‌ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వీడియోలు వైరల్ గా మారాయి. ఈ విరుష్క జోడీ కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్లు వస్తున్నాయి. ఈ జంట ఇప్పటికీ ప్రేమికుల్లాగే ఉన్నారని నెటిజన్లు అంటన్నారు.

అనన్య బిర్లా రియాక్షన్

ఆ క్యాచ్ డ్రాప్

అంతకుముందు మ్యాచ్ లో విరాట్ కోహ్లి క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు కూడా అనుష్క శర్మ రియాక్షన్ ఆన్ లైన్ లో త్వరగానే చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. 18వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అనికేత్ క్యాచ్ ను కోహ్లి పట్టలేకపోయాడు. ఆ క్యాచ్ మిస్ అయిన తర్వాత స్టాండ్స్ లోని అనుష్క నవ్వుతూ కనిపించింది.

ఆర్సీబీ విన్

ఐపీఎల్ 2026ను డిఫెండింగ్ ఛాంపియన్ భారీ విక్టరీతో స్టార్ట్ చేసింది. శనివారం (మార్చి 28) రాత్రి ముగిసిన మ్యాచ్ లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్‌పై గెలిచింది. మరో 26 బాల్స్ ఉండగానే 202 పరుగులు టార్గెట్ ను ఛేజ్ చేసింది.

ఫస్ట్ ఇషాన్ కిషన్ (80), అనికేత్ వర్మ (43) చెలరేగడంతో సన్ రైజర్స్ 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేజింగ్ లో కోహ్లి (69 నాటౌట్)తో పాటు దేవదత్ పడిక్కల్ (61) రాణించడంతో ఆర్సీబీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks